చిన్నారికి డబుల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన అనుష్క

Anushka Sharma Surprises A Girl Child

10:07 AM ON 15th March, 2016 By Mirchi Vilas

Anushka Sharma Surprises A Girl Child

సినీ పరిశ్రమలో టాలీవుడ్‌, బాలీవుడ్‌ అని తేడా లేకుండా చాలా మంది సెలబ్రిటీలు తమలోని సేవా గుణాన్ని.. సామాజిక కోణాన్ని బహిరంగ పరుస్తూ, అభిమానులకు ఆనందాన్ని పంచుతున్నారు. ఆ మధ్య ఓ చిన్నారి ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ తన అభిమాన హీరోను చూడాలని కోరుకుంటే , తక్షణమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కడకు వెళ్లి ఆ చిన్నారికి కొత్త ఉత్సాహం నింపాడు. ఇలా పలు ఘటనలు చూస్తూనే వున్నాం. తాజాగా బాలీవుడ్‌ బబ్లీ బ్యూటీ అనుష్కశర్మ కూడా తనలోని సేవా గుణాన్ని , సామాజిక దృక్పధాన్ని చాటుకుంది. ‘మేక్‌ ఏ విష్‌’ ఫౌండేషన్‌తో చేతులు కలిపిన అనుష్క బిజీ షెడ్యూల్‌లోనూ తన చిన్నారి అభిమానిని కలిసి అందరితో శభాష్‌ అనిపించుకుంది.

తన అభిమాన నటి అనుష్కశర్మను కలవాలని ఉందని అశ్రిత అనే చిన్నారి అడగడంతో తల్లిదండ్రులు ‘మేక్‌ ఏ విష్‌ ఫౌండేషన్‌’ని సంప్రదించారు. సదరు సంస్థ ద్వారా విషయం తెలుసుకున్న అనుష్కశర్మ.. ఇటీవల అశ్రితను కలిసి కబుర్లు చెప్పింది. ఒక్కర్తే కాదు ఏకంగా . తన వెంట రణవీర్ ని తీసుకొచ్చి అశ్రితకు డబుల్‌ సర్‌ప్రైజ్‌ అందించింది. అప్పటివరకు అనుష్క మాత్రమె వస్తుందని భావించిన అశ్రితకు బాలీవుడ్‌ ‘బాజీరావు’ రణ్‌వీర్‌సింగ్‌తో వచ్చి ఆ చిన్నారి మనసును ఆనందడోలికల్లో తేలియాడేలా చేసింది.

సామాజిక కార్యక్రమాలంటే ఆసక్తి గల రణ్‌వీర్‌.. అనుష్క ద్వారా అశ్రిత విషయం తెలుసుకొని తానూ బయల్దేరి వచ్చాడట. దీంతో అశ్రిత కుటుంబసభ్యుల అనందానికి హద్దుల్లేకుండా పోయాయి. మంచి కార్యక్రమాలకు ఇలా కల్సి వస్తే, జనంలో క్రేజ్ కూడా డబుల్ కాదు త్రిబుల్ అవుతుంది .

English summary

Bollywood Heroine Anushka Sharma along with Ranveer Singh visits a to fulfill a fan's wish.Ashrita's only dream was to meet Anushka Sharma.Anushka Sharma Came to know about Ashrita by Make A Wish Foundation and She went her home along with hero Ranveer Singh and Surprises that Child.