గర్భవతైన అనుష్క!

Anushka Shetty is pregnant

03:04 PM ON 11th March, 2016 By Mirchi Vilas

Anushka Shetty is pregnant

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో టాప్‌ హీరోయిన్‌గా వెలుగొందుతున్న అనుష్క శెట్టి ఇప్పుడు గర్భవతి అయింది. అవును మీరు వింటుంది నిజమే అనుష్క ఇప్పుడు గర్భవతి. అనుష్క గర్భవతి ఎందుకైందో తెలుసుకోవాలంటే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే. ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' చిత్రంలో అనుష్క దేవసేన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటించిన ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన అనుష్క హీరోయిన్‌గా నటించిది. అయితే 'బాహుబలి' మొదటి భాగంలో అనుష్క ముసలి గెటప్‌లో కనిపించి అందరినీ షాక్‌కి గురి చేసింది. అయితే ఇప్పుడు 'బాహుబలి -2' షూటింగ్‌ జరుగుతుంది.

ఈ భాగంలో అనుష్క(దేవసేన) ప్రభాస్‌(అమరేంద్ర బాహుబలి) ని ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంది. ఆ తరువాత అనుష్క గర్భవతి అవుతుంది. తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడని రానా(భల్లాలదేవ) బాహుబలి పై కక్ష పెంచుకుంటాడు. ఈ నేపధ్యంలో భల్లాలదేవ బాహుబలిని చంపిస్తాడు. ఆ తరువాత దేవసేన బిడ్డని కంటుంది. ఆ తరువాత దేవసేనని భల్లాలదేవ కారాగారంలో బంధిస్తాడు. ప్రస్తుతం ఈ సన్నివేశాలు చిత్రీకరణ జరుగుతుంది. ఈ సన్నివేశాల్లో వచ్చే సెంటిమెంట్‌ బాగా పండుతుందని అదే హైలెట్‌గా నిలుస్తుందని యూనిట్‌ సభ్యులు చెప్తున్నారు.

English summary

Tollywood top heroine Anushka Shetty is now pregnant. Yes it is correct she is pregnant in Baahubali 2 movie. Now this scenes were screening by Rajamouli.