అది తప్పేలా అవుతుంది అంటున్న అనుష్క

Anushka Shetty speaks about herself

11:57 AM ON 10th May, 2016 By Mirchi Vilas

Anushka Shetty speaks about herself

తోటి తారలతో సైతం ‘స్వీటీ...సో స్వీట్‌’ అనిపించుకునే అనుష్క అందానికే కాదు, ఆమె వ్యక్తిత్వానికీ అభిమానులున్నారు. నీ మనసుకి తగ్గ పేరే పెట్టారని ఆమె ముందే పొగుడుతుంటారు. అనుష్క ప్రస్తుతం ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’, ‘భాగ్‌మతి’, ‘సింగం 3’ చిత్రాల్లో నటిస్తోంది. అనుష్క అసలు పేరు స్వీటీనే. సినిమాల్లోకి వచ్చే ముందు రెండోసారి నామకరణం చేసుకొంది. ఒక అగ్ర తారగా వెలుగుతున్నా సరే... నలుగురి ముందు మాత్రం అత్యంత సాధారణంగా మసలుకొంటుంది స్వీటీ. ఆమెలో ఎక్కువ మందికి నచ్చే గుణం అదే. మరి ఆమెకు ఏం నచ్చుతుందో ఆమె మాటల్లో విందాం. ‘‘నాలో నాకు నచ్చేదీ, ఎదుటివాళ్లల్లో నేను కోరుకొనేది కూడా సింప్లిసిటీనే. మనం మనలా ఉంటే తప్పేంటి? కొని తెచ్చుకొన్న ఆర్భాటాలెందుకు? దాని వల్ల ఇబ్బందే తప్ప మేలు జరగదు. ఎందుకో నలుగురిలో అలా మసలుకోవడం పై నాకు మొదట్నుంచీ ఇష్టం లేదు. బహుశా మా నాన్నగారి ప్రభావమేమో! అందరూ నన్ను పొగుడుతుంటారు కానీ... మా నాన్న నడుచుకొనే విధానం చూస్తే ‘పర్‌ఫెక్ట్‌ మేన్‌’ అనాల్సిందే. ఇక రెండో విషయానికొస్తే నిజాయతీ. నవ్వు, మాట, చూపుల్లోనూ నిజాయతీ కనిపించాలి. అలాంటి వ్యక్తులతో మాట్లాడ్డానికి ఇష్టపడుతుంటా’’ అని చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి:సదా నా ప్రేమకు నేనే బానిసను...

ఇవి కూడా చదవండి: భార్యను వ్యభిచారంలోకి దింపిన భర్త.. ఆ తరువాత భర్తకు షాకిచ్చిన భార్య

ఇవి కూడా చదవండి:ఇక పై సినిమాలు చెయ్యనన్న సమంత

English summary

South Actress Anushka Shetty was known for his simplicity and acting. She says that she will be polite always and she will talk less with unknown Person.