కత్తిలో చిరు సరసన  జేజమ్మ !

Anushka To Act in Chiranjeevi 150th Film

11:40 AM ON 13th April, 2016 By Mirchi Vilas

Anushka To Act in Chiranjeevi 150th Film

ఏ నిమిషానికి ఏమి జరుగునో ... అన్నారు అందుకే ... మెయిన్ హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఎంచుకోవడం మొదలెట్టాక, గ్లామర్‌ పాత్రలకు పూర్తిగా దూరమైన అనుష్క కమర్షియల్‌ చిత్రాల్లో కనిపించడమే లేదు. అయితే... జేజమ్మకీ ఇప్పుడు గ్లామర్‌ పాత్రలపై దృష్టి మళ్లింది. ‘అలాంటి సినిమాలొస్తే బాగుణ్ణు’ అని మీడియా ముందూ తన మనసులో మాట ఈ మధ్య బయటపెట్టింది. దీంతో ఆ అవకాశం తరుముకుంటూ వచ్చేసిందా! పైగా చిరంజీవి 150వ చిత్రంతో అది నేరవేరబోతోందని టాక్‌. ... చిరంజీవి - వి.వి.వినాయక్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకోబోతోంది. తమిళ ‘కత్తి’కి ఇది తెలుగు రూపం. కథానాయికగా నయనతారని ఎంచుకొందామనుకొన్నారు. అయితే ఆమె భారీ పారితోషికం డిమాండ్‌ చేయడంతో చిత్రబృందం చూపు అనుష్కపై పడిందని అంటున్నారు. ‘స్టాలిన్‌’ సినిమా కోసం అనుష్క ఓ ఐటెం సాంగ్ లో నర్తించింది. ఆ తరవాత వీరిద్దర్నీ జంటగా చూసే అవకాశం దక్కలేదు. చిరు 150వ చిత్రమే అందుకు వేదిక కావొచ్చని అంటున్నారు. అనుష్క దాదాపు నిర్ణయం అయిందని తెలుస్తోంది.

ఇవి కూడా చూడండి:

ఎత్తు పెరగాలంటే ఇవి తినాల్సిందే

సర్దార్ పై బాబీ తండ్రి షాకింగ్ కామెంట్స్

ఆ గుళ్ళోకొస్తే రేప్‌లు జరుగుతాయా?

English summary

Heroine Anushka to act in Mega Star Chiranjeevi's 150th movie.Previously Nayanatara was selected as heroine and now instead of Nayanatara , Anushka was taken as heroine.