ఐటమ్‌ గర్ల్‌గా మారిన 'అనుష్క'!!

Anushka turned as item girl

03:44 PM ON 5th January, 2016 By Mirchi Vilas

Anushka turned as item girl

2015లో బాహుబలి, రుద్రమదేవి, సైజ్‌జీరో చిత్రాలతో అలరించిన అనుష్క ప్రస్తుతం 2016 లో బాహుబలి -2, సింగం -3 చిత్రాల్లో నటిస్తుంది. ఇదిలా ఉండగా అల్లుఅర్జున్‌-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'సరైనోడు' చిత్రంలో అనుష్క ఐటమ్‌ గర్ల్‌గా దర్శనమివ్వబోతుందని తాజా సమాచారం. ప్రస్తుతం తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా వెలిగిపోతున్న అనుష్క ఇలా ఐటమ్‌ గర్ల్‌గా మారడానికి గల కారణాలు రెండు వినిపిస్తున్నాయి. ఒకటి 2015 లో గుణశేఖర్‌ అనుష్కతో తెరకెక్కించిన 'రుద్రమదేవి' చిత్రంలో గోన గన్నారెడ్డి పాత్ర కోసం చాలా మంది స్టార్ హీరోలని అడిగినా ఎవరూ చెయ్యడానికి అంగీకరించ లేదు.

అలాంటి సమయంలో అల్లు అర్జున్‌ ముందుకొచ్చి ఈ పాత్రలో నటించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సమయంలోనే అనుష్క-అల్లుఅర్జున్ మధ్య మంచి స్నేహం ఏర్పడిందని అందుకే అనుష్క నటించడానికి అంగీకరించిందని చెప్తున్నారు. ఇంకొకటి అనుష్క-అల్లుఅర్జున్‌ కలిసి నటించిన వేదం, రుద్రమదేవి చిత్రాలు తొలుత నెగిటీవ్‌ టాక్ తెచ్చుకుని ఆ తరువాత సూపర్‌ హిట్‌ టాక్ సంపాదించుకుంది. ఇప్పుడు సరైనోడు కూడా అలానే సూపర్‌ హిట్‌ అవుతుందనే అనుష్క చెయ్యడానికి ఒప్పుకుందని మెగా అభిమానులు భావిస్తున్నారు.

English summary

Anushka turned as item girl for Allu Arjun Sarainodu movie.