పవన్‌ కోసం తపిస్తున్న 'దేవసేన'

Anushka want to pair with Pawan Kalyan

05:07 PM ON 12th December, 2015 By Mirchi Vilas

Anushka want to pair with Pawan Kalyan

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ సరసన ఒక్కసారైనా నటించాలని ప్రతీ హీరోయిన్‌ పడి తపించుపోతుంది. అలానే ఒక హీరోయిన్‌ పవన్‌తో నటించాలని ఎంతో ఆశగా ఉందట. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోలైన మహేష్‌బాబు, నాగార్జున, ప్రభాస్‌, బాలకృష్ణ, వెంకటేష్, రవితేజ, గోపిచంద్‌ వంటి అగ్ర కథానాయకులతో నటించిన ఈ బ్యూటీ పవన్‌కళ్యాణ్‌ తో మాత్రం నటించలేదని తెగ బాధపడిపోతుంది. ఇంతకీ ఆ భామ ఎవరో కాదు టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్ అయిన అనుష్క. అయితే గతంలో అనుష్క మెగస్టార్‌ చిరంజీవితో ఒక ఐటమ్‌ సాంగ్‌లో నటించింది.

కానీ ఇంతవరకు పవన్‌కళ్యాణ్‌ తో మాత్రం స్క్రీన్‌ మాత్రం షేర్‌ చేసుకోలేకపోయింది. ఎంతో మంది హీరోయిన్‌లకు అవకాశం ఇచ్చిన పవన్‌ అనుష్కకి ఛాన్స్‌ ఇస్తాడో లేదో చూడాలి. అయితే అనుష్క కోరిక గురించి కొంతమంది పవన్‌ దగ్గర చెప్పితే ఒక్క నవ్వు నవ్వాడట పవన్‌.

English summary

Anushka want to pair with Pawan Kalyan.