అవి తలచుకుని ఎన్నో రాత్రులు ఏడ్చా..!

Anushka was cried so many nights

01:01 PM ON 30th August, 2016 By Mirchi Vilas

Anushka was cried so many nights

స్వీటీ అనుష్క తన గతాన్ని గుర్తు చేసుకుంది. 36 ఏళ్ల వయసులోనూ 16 ఏళ్ల పడతిలా మెరిసిపోతోన్న ఈ అమ్ముడిచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో విశేషాలు చెప్పుకొచ్చింది. ఆమె అసలుపేరు అనుష్క కాదు.. స్వీటీ. తన సర్టిఫికేట్స్ లో, ఇంట్లోనూ స్వీటీ అనే అంటారట. యోగాలో ట్రైనింగ్ తీసుకుని హైదరాబాద్ లో క్లాసులు చెప్తుంటే, పూరీజగన్నాథ్ 'సూపర్' మూవీలో నాగార్జునతో నటించే ఛాన్స్ ఇచ్చారని, అప్పటి వరకూ తనకు యాక్టింగ్ అంటే ఏంటో కనీసం అవగాహన కూడా లేదని అనుష్క చెప్పుకొచ్చింది. ఏడాది వరకూ ఇండస్ట్రీలో ఇమడలేక పోయానని, యాక్టింగ్ పై ప్రత్కేక దృష్టి కూడా పెట్టలేకపోయానని చెప్పింది.

నటించేటప్పుడు చాలా సిగ్గు పడేదాన్ని. అది తలచుకుని ఎన్నో రాత్రులు బాధపడ్డా. చాలాసార్లు ఏడ్చేశా కూడా. అలా మనసు వద్దు అంటున్నా ప్రయత్నం, పట్టుదలతో నటనపై పట్టు సాధించా అని అనుష్క చెప్పుకొచ్చింది. ఆరంభంలో నన్ను గుర్తు పట్టడానికి చేతిలో పాస్ పోర్టు ఫొటో తప్ప ఏమీ లేదని, తర్వాత ఫోటో సెషన్ చేశారని తెలిపింది. మొదట్లో అనుష్క అని ఐదారు సార్లు పిలిస్తేగానీ తిరిగి చూసేదాన్ని కాదని. అదే స్వీటీ అని పిలిస్తే వెంటనే స్పందించేదాన్నని చెప్పుకొచ్చింది స్వీటీ బ్యూటీ. ఇంతకీ ఈ అమ్మడు ఒలంపిక్ రజత పతక విజేత సింధుని అభినందించి, శుభాకాంక్షలు తెల్పింది.

ఇది కూడా చదవండి: ఛీ..ఛీ.. ఇద్దరు స్టూడెంట్‌లను పెళ్లాడిన గురువు

ఇది కూడా చదవండి: అమెరికన్ లేడీస్ టాప్ లెస్ గా తిరిగారు(ఫోటోలు)

ఇది కూడా చదవండి: కరీనా కంటనీరు..కారణం అదా?

English summary

Anushka was cried so many nights