బండి ఆపి తాళం లాక్కునే అధికారం ఏ పోలీసుకు లేదట

Any police has no power to take vehicle keys

11:48 AM ON 19th May, 2016 By Mirchi Vilas

Any police has no power to take vehicle keys

మనం బైక్ పై వెళ్తుంటే సడన్ గా ఎప్పుడూ జరిగే సంఘటనే ఇది. అక‌స్మాత్తుగా ట్రాఫిక్ కానిస్టేబుళ్ళు అడ్డంగా వచ్చి మీరు బండి ఆపేలోపే వాళ్ళు బండి తాళాలు లాక్కుంటారు. లైసెన్స్, బండి కాగితాలున్నాయా? చూపించు అంటూ హడావిడి చేసేస్తారు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మనలో చాలామందికి ఇలాంటి అనుభవం ఎదురవుతుంది. సిగ్నల్స్ వద్ద, చెకింగ్ పాయింట్స్ వద్ద పోలీస్ కానిస్టేబుల్స్ వాహనాలను ఆపగానే బండికున్న తాళాన్ని లాక్కుంటూ ఉంటారు. ఆ తర్వాతే మన దగ్గరున్న లైసెన్స్, ఇతర ధృవీకరణ పత్రాలు పరిశీలిస్తారు. అయితే అలా బండి తాళాన్ని లాక్కునే అధికారం పోలీస్ కానిస్టేబుల్‌కే కాదు, మరే ఇతర పోలీస్ అధికారికి కూడా లేదని రవాణా శాఖ తాజాగా స్పష్టం చేసింది.

హర్యానాలోని సిర్ఫా ప్రాంతానికి చెందిన పవన్ పారిఖ్ అనే లాయర్ ఇలా బైక్ తాళం లాక్కునే హక్కు పోలీసు కానిస్టేబుల్‌కి ఉందా, అని ఆర్‌టీఏని ప్రశ్నించాడు. దాని పై స్పందించిన రాష్ట్ర హోం శాఖ ‘అలా బండి తాళం తీసుకొనే హక్కు కానిస్టేబుల్‌కే కాదు, మరే పోలీసు అధికారికి లేదు’ అని తెలిపింది. పోలీసులకి ఈ విషయం తెలియక వారు అలా ప్రవర్తిస్తున్నారని పేర్కొంది. పవన్ కి కూడా ఇలాంటి సంఘటనే ఎదురవ్వడం వల్ల సూటిగా రవాణా శాఖను ప్రశ్నించాడు. నిజానికి ఇది చాలా మందికి ఎదురయ్యే సంఘటనే. బండి ఆపకముందే తాళాన్ని లాక్కుంటారు, బండి కాగితాలు చూపించేదాకా కూడా ఆగారు.

గతంలో కూడా ట్రాఫిక్ కానిస్టేబుల్స్ మీద ఇలాంటి అభియోగాలే చాలా వచ్చాయి. అంతేకాదు అర్హతతో సంబంధం లేకుండా ఎవరుపడితే వారు రశీదు పుస్తకాన్ని చేత పట్టి ఫైన్‌లు వేసిన రోజులు కూడా గతంలో చాలానే ఉన్నాయి.

English summary

Any police has no power to take vehicle keys