వాడివేడిగా అసెంబ్లీ సమావేశం

AP Assembly Sessions Highlights

03:46 PM ON 8th March, 2016 By Mirchi Vilas

AP Assembly Sessions Highlights

ఎపి అసెంబ్లీలో మంగళవారం వాడీ వేడీ చర్చ జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ప్రకటన చేశారు. ఆ అంశంపై జరిగిన చర్చలో పాల్గొన్న ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో మహిళలకు జరుగుతున్న అన్యాయం, మహిళలపై జరుగుతున్న దాడులు, అధికార పార్టీ సభ్యులు ప్రవర్తిస్తున్న తీరును విమర్శించారు. ఆయా అంశాలకు అనుగుణంగా టిడిపి ఎంఎల్ఏలు ఈ సందర్భంగా జగన్ తీరుని విమర్శించారు.

 బాబు మనస్సుకి రిపేరు అవసరమన్న జగన్ ...

   చంద్రబాబు నాయుడు ముందు తన మనసును రిపేరు చేసుకోవాలని.. తర్వాత వ్యవస్థను రిపేర్ చేయడం మొదలుపెట్టాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అసెంబ్లీలో మంగళవారం జరిగిన చర్చలో పాల్గొంటూ వ్యాఖ్యానిచారు. 'ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళా దినోత్సవం అని కూడా చూడకుండా కన్నార్పకుండా అబద్ధాలు చెప్పిన తీరు ఆహా.. అనిపిస్తోంది. మహిళలకు సమానహక్కులు ఉండాలన్న ఉద్దేశంతో మార్చి 8ని మహిళా దినోత్సవంగా చేసుకుంటున్నారు. కానీ రాష్ట్రంలో నిజంగా స్త్రీలను గౌరవిస్తున్నామా అని మనం గుండెల మీద చేతులు వేసుకుని ప్రశ్నించుకోవాలి. ఉదాహరణకు ఇదే చట్టసభలో నా సోదరి రోజాను నిబంధనలు ఒప్పుకోకపోయినా సంవత్సరం పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. చట్టసభలు చేసే ఇదే సభలో చట్టాలను ఉల్లంఘిస్తూ ఒక మహిళా ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన ఘనత ఈ శాసనసభదే.

ఇదే ఆంధ్ర రాష్ట్రంలో వనజాక్షి అనే ఎమ్మార్వోను ఇసుక మాఫియాకు అడ్డు తగులుతోందని జుట్టు పట్టుకుని ఈడ్చిన ఒక శాసనసభ్యుడు ప్రవర్తించిన తీరు చాలా హేయం. ఆ ఎమ్మెల్యే మీద కేసులు లేవు.. అరెస్టులు లేవు. ఇదే రాష్ట్రంలో, ఇదే సభకు చెందిన ఎమ్మెల్యే అంగన్‌వాడీ కార్మికులను దుర్భాషలాడుతూ తిడితే ఆ కార్మికులంతా ఆ శాసన సభ్యుడికి వ్యతిరేకంగా ధర్నా చేస్తే కనీసం ఆ ఎమ్మెల్యే మీద కేసులు కూడా నమోదు కావు.

నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ చదువుతున్న రిషితేశ్వరి అనే విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడితే ప్రిన్సిపల్‌ను అరెస్టు చేశారని ఇప్పుడు వింటున్నాం.. అరెస్టు చేసినంత స్పీడుగానే బెయిలిచ్చి కూడా పంపిస్తున్నారు. వడ్డీ వ్యాపారం పేరిట అధిక వడ్డీలకు డబ్బులిచ్చి, కట్టలేని పరిస్థితిలో ఉన్న పేద అక్క చెల్లెమ్మలను సెక్స్ రాకెట్‌లోకి దింపి, వీడియోలు రికార్డు చేసి, వాటితో బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. ఆ నేరం చేసింది సాక్షాత్తు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ముఖ్యమంత్రితో, ఇంటెలిజెన్స్ ఐజీతో నిందితులు మాట్లాడుతున్న ఫొటోలున్నా జైళ్లకు ఎవరినీ పంపరు, కేసులు నామమాత్రంగా పెడతారు. చివరకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారు.

ఉమ్మడి రాజధానిలో ఒక వ్యక్తి తాగి ఒక మహిళను వెంటపడి ఆమెను కారులోకి లాగి బలాత్కరించే ప్రయత్నం చేసినప్పుడు స్థానికులు ఆ వ్యక్తిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పజెబితే.. ఆ వ్యక్తి తండ్రి మంత్రిగా ఇక్కడ కొనసాగుతున్నారంటే నిజంగా దారుణం. తన కొడుకు ఇంతటి దారుణమైన పని చేస్తే.. దాన్ని కూడా జగన్ మోహన్ రెడ్డి చేసిన కుట్ర అని చెప్పే అన్యాయమైన వ్యవస్థ చూస్తుంటే, ఇలాంటి వ్యక్తిని మంత్రిగా కొనసాగిస్తున్న ముఖ్యమంత్రిని చూస్తే సిగ్గుతో తల వంచుకోవాల్సి వస్తోంది.ఇదే చట్టసభలో ఉన్న మరో ఎమ్మెల్యే ఒక కార్యక్రమంలో మహిళల గురించి చాలా లోకువగా మాట్లాడారు' అంటూ జగన్ విమర్శల వర్షం కురిపించారు.

జగన్ వ్యాఖ్యలకు పలువురు శాసనసభ్యులు ఇలా స్పందించారు..

1/8 Pages

మరి నేను రోజా లాంటి సోదరిని కాదా?: అనిత

ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌ పై ఏపీ శాసనసభ దద్ధరిల్లింది. 'గత సమావేశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబును, టీడీపీ సభ్యులను ఉద్దేశించి రోజా అన్న మాటలు జగన్‌కు వినిపించలేదా?' జగన్‌కు తాను నేను రోజా లాంటి సోదరిలా కనిపించడం లేదా ?' అని టీడీపీ ఎమ్మెల్యే అనిత నిలదీశారు. తనను అవమానించిన రోజాను జగన్‌ వెనకేసుకొస్తున్నారంటూ ఆమె విమర్శిస్తూ, ఇప్పటికైనా రోజాను మంచి మార్గంలో నడిపించమని సూచించారు. ఈ విషయంలో వారు చేసే న్యాయమే తనకిచ్చే గౌరవమని పేర్కొన్నారు.

English summary

Andhra Pradesh Assembly Sessions were started today and Ysrcp MLA fires on Telugu Desam Party Government.Jagan Says that TDP government was not respecting for Woman in Andhra Pradesh and Jagan Fires on Bala Krishna Words on Woman also.Soo many TDP MLA's were responded on Jagan words .Assembly was Postponed to Tomorrow.