కొత్త వివాదంలో కోడెల

AP Assembly Speaker Kodela Siva Prasad into another tiff

10:58 AM ON 22nd June, 2016 By Mirchi Vilas

AP Assembly Speaker Kodela Siva Prasad into another tiff

అసలే ఎన్నడూ లేనంతగా ఈసారి ప్రతిపక్షం నుంచి విమర్శలు ఎదుర్కొంటూ, అవిశ్వాసం కూడా ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల్లో తాను 11కోట్లు ఖర్చుపెట్టానంటూ ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డాక్టర్ కోడెల స్వయంగా వెల్లడించారన్న వార్తలు గుప్పుమన్న నేపథ్యంలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ స్పీకర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. కోడెల ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో 80లక్షలు ఖర్చుచేసినట్టు చూపించి, ఇప్పుడు 11కోట్లకు పైగా ఖర్చయిందని చెప్పడం అనైతికమని వైసిపి నేత అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.

అయితే, ఈ ఆరోపణలపై స్పీకర్ వివరణ ఇచ్చేప్రయత్నం చేశారు. ఎన్నికల్లో ఖర్చు పెరిగిపోతోందని, ఎన్నికలకు ముందు, వెనుక ఖర్చుకు అడ్డు అదుపు ఉండటంలేదని దాదాపు 11కోట్లకు పైగా సొమ్ములు ఖర్చైపోతున్నాయని, పలువురు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు తన దగ్గరకు వచ్చి చెప్పిన నేపథ్యంలో అవే తాను మీడియా ముందు వెల్లడించినట్టు కోడెల చెప్పుకొస్తున్నారు. అయితే, తన మాటలను వక్రీకరంచి ఇలా ప్రచారం చేస్తున్నారని కూడా డాక్టర్ కోడెల క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి ఎవరైనా సరే మీడియా ముందు మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్త అని ఈ ఘటన చెప్పకనే చెబుతోంది.

ఇవి కూడా చదవండి:అవన్నీ రూమర్లే నన్న రవిప్రకాష్

ఇవి కూడా చదవండి:అమరావతిలో 153 ఏళ్ల కిందట అద్భుత కట్టడం!

English summary

Andhra Pradesh Assemble Speaker Kodela Siva Prasad was strucked into another stiff . And YSR Congress Party complained over him and demanded to remove him as assembly speaker.