వార్తల్లో మనవడు ...

A.P CM Chandrababu Grandson In News

03:02 PM ON 29th December, 2015 By Mirchi Vilas

A.P CM Chandrababu Grandson In News

అవును ఈ మనవడు తరచూ వార్తల కెక్కుతున్నాడు. ఓ పక్క రాజకీయ వ్యూహ నిపుణుడు ఏ పి సిఎమ్ చంద్రబాబు , మరోవైపు యువరత్న నందమూరి బాల కృష్ణ లకు మనవడు కావడంతో ప్రముఖులతో ఈ మనవడికి ఇప్పటి నుంచే సంబంధ భాంధవ్యాలు ముమ్మరమయ్యాయి. ఇది ముందస్తు ఎత్తుగడో ,రాజకీయ వ్యూహమో గానీ ఈ బుడతడు ప్రముఖుల చెంత చేరుతున్నాడు. తన బోసి నవ్వులతో , చేష్టలతో అలరిస్తున్నాడు.

ఇంతకీ విషయమేమంటే , చంద్రబాబు ఏకైక వారసుడు.. అన్నీ అనుకూలిస్తే నవ్యాంధ్ర కు కాబోయే సిఎమ్ నారా లోకేష్ పుత్ర రత్నం దేవాన్ష్ గురించి. బాలయ్య కూతురు బ్రాహ్మణి , అల్లుడు లోకేష్ ల తనయ్డు కూడా కావడంతో దేవాన్ష్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఎపికి ఎవరైనా ప్రముఖులు వస్తే, అక్కడ దేవాన్ష్ సందడి తప్పక కనిపించేలా చేస్తున్నారు.

ఆమధ్య విజయ దశమి నాడు నూతన రాజధాని అమరావతి శంఖుస్థాపనకు మోడీ వచ్చినపుడు ఈ బుడతడిని కూడా వెనబెట్టుకుని నారా -నందమూరి కుటుంబాలు మోడీని కల్సుకున్నాయి. కుశల ప్రశ్నలు సరే సరి. ఇంతలోనే తన చేష్టలతో మోడీ దృష్టిని దేవాన్ష్ ఆకర్షించాడు. మోడీ కళ్ళజోడు ని దేవాన్ష్ లాక్కోబోతే , మోదీయే ముచ్చటగా ఆ కళ్ళజోడు ని తీసి దేవాన్ష్ కి పెట్టారు. ఈ ముచ్చట చూసిన నారా - నందమూరి కుటుంబాల్లో ఒకటే ఆనందం.

అది అలా ఉంచితే , నిన్నటికి నిన్న మైక్రోసాఫ్ట్ సి ఇ ఓ సత్య నాదెళ్ళ వస్తే , అక్కడ కూడా దేవాన్ష్ సందడే. సిఎమ్ చంద్రబాబు నివాసంలో దేవాన్ష్ ని చూసిన సత్య నాదెళ్ళ , తన చేతుల్లోకి తీసుకుని ఎత్తుకుని ముద్దాడారు. ఇక నారా వారి ఇంట్లో ఆనందమే ఆనందం.

ఇక మనవడి అచ్చటా ముచ్చటా తీర్చడంలో కూడా చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. దేవాన్ష్ పుట్టి వెంట్గ్రుకలు తీయించడానికి ఆమధ్య చేసిన సందడి అంతాఇంతా కాదు. ఏదో కుటుంబ వ్యవహారమని వదిలేయకుండా చంద్రబాబు మనవడిని ఎత్తుకుని దగ్గరుండి పుట్టి వెంట్రుకలు తీయించారు. ఎన్ టి ఆర్ మాదిరిగా కుటుంబాన్ని ప్రేమించే తత్త్వం బాబు గారిలో మనవడి రాకతో దండిగా కనిపిస్తోందని అంతా అనుకుంటున్నారు.

ఈ వ్యవహారం అంతా చూస్తుంటే , భవిష్యత్ నారావారి రాజకీయ వారసుడిగా దేవాన్ష్ రూపు దాలుస్తాడని అనడంలో సందేహం లేదేమో .....

English summary

Devansh, now a days trending name in ap political events. This cute little master was grand son of CM Chandrababu naidu and Tollywood top hero Balakrishna.