వరద నష్టం పై రేపు సాయంత్రానికల్లా నివేదిక కోరిన సిఎమ్ 

AP CM Chandrababu Naidu Asks Report About Loss In Floods

12:01 PM ON 24th November, 2015 By Mirchi Vilas

AP CM Chandrababu Naidu Asks Report About Loss In Floods

నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలో వరద నష్టంపై బుధవారం సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఏపీ ఆదేశించారు. మంగళవారం వరద నష్టం, పునరావాస కార్యక్రమాలపై టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలకు చెందిన ఏడు వేల మంది అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వరదల వల్ల రేషన్‌కార్డులు పోయినవారి విషయంలో ఉదారంగా వ్యవహరించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా ఇబ్బంది పెట్టవద్దని ఆయన స్పష్టం చేసారు.

కాగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడికక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సిఎమ్ పేర్కొంటూ , తద్వారా అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తెలిపారు. మంత్రులు ముంపు ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా ఇవ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు

English summary

Andhra Pradesh Cheif Minister ChandraBabu Naidu Asks The Report about the ammount of loss that occured in recent floods in nellore,chittoor,kadapa districts. He odered the aurthorities of the districts to give report by the evning