అభిమానం హద్దు మీరితే చర్యలు

AP DGP Warns to Chiru and Balayya Fans

10:50 AM ON 9th January, 2017 By Mirchi Vilas

AP DGP Warns to Chiru and Balayya Fans

హీరోల సినిమాలు విడుదలైతే అభిమానుల హడావిడి చెప్పక్కర్లేదు. ఇక ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు వస్తుంటే, అభిమానుల కామెంట్స్ మితిమీరిపోతాయి. ఒక్కోసారి శాంతి భద్రతల సమస్యగా మారిపోతుంది. ఇక ఇప్పుడు సంక్రాంతికి చిరంజీవి 150వ సినిమా, బాలకృష్ణ 100వ సినిమా విడుదల కానుండటంతో వీరి అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ‘సంక్రాంతి మాదే.. మా హీరో సినిమానే హిట్టవుతుంది’ అంటూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. సోషల్ మీడియాలో వివాదాస్పద కామెంట్లు పెడుతున్నారు. దీంతో అక్కడక్కడ ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. ఈ వ్యవహారంపై డీజీపీ సాంబశివరావు స్పందించారు. విజయవాడలో పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించారు. థియేటర్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని, రెండు సినిమాలు ఒకే కాంప్లెక్స్ లో రిలీజవుతుంటే అక్కడ మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పారు

‘మీరు చిరంజీవిని అభిమానిస్తారో.. బాలకృష్ణను అభిమానిస్తారో మీ ఇష్టం. అందుకు మాకెలాంటి అభ్యంతరమూ లేదు. కానీ ఎదుటి వారి పోస్టర్లు చించినా, సోషల్ మీడియాలో అనుచిత కామెంట్లు పెట్టినా చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తాం’ అని డీజీపీ సాంబశివరావు హెచ్చరించారు. అభిమానం తప్పు కాదు, దురభిమానంతో హద్దు మీరితే అడ్డుకట్ట వేస్తామని స్పష్టం చేశారు.

ఇది కూడా చూడండి: ఆ సమయాల్లో తులసి ఆకులు తెంపితే ఏమౌతుందో తెలుసా

ఇది కూడా చూడండి: పార్వతి శాపంతో కప్పగా 12 ఏళ్లపాటు గడిపిందెవరంటే ...

ఇది కూడా చూడండి: 2017 లో మన జాతకం ఇలా ఉంటుందట

English summary

AP DGP Warns to Chiru and Balayya Fans