ఏపీ డీఎస్సీ-2014 షెడ్యూల్‌ వచ్చేసింది

AP DSC Schedule Released

11:58 AM ON 17th May, 2016 By Mirchi Vilas

AP DSC Schedule Released

హమ్మయ్య, గడిచిన ఏడాదిన్నర కాలంగా నిరీక్షిస్తున్నఏపీ డీఎస్సీ-2014 అభ్యర్థులకు ప్రభుత్వం ఎట్టకేలకు తీపికబురు అందించింది. నియామక పత్రాలు అందించేందుకు పచ్చజెండా వూపుతూ ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం విజయవాడలో షెడ్యూల్‌ విడుదల చేశారు. ఈనెల 26న ధ్రువపత్రాలు పరిశీలించిన అనంతరం 28న తుదిజాబితా ప్రకటిస్తామని, 29 నుంచి 31 వరకు వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని ఆయన సూచించారు. ఎంపికైన అభ్యర్థులకు జూన్‌ 1న నియామక పత్రాలను సీఎం చేతుల మీదుగా అందజేస్తామని వెల్లడించారు. నూతన ఉపాధ్యాయులు పాఠశాలలు పునఃప్రారంభం అయినప్పటి నుంచి విధులకు హాజరవుతారని మంత్రి గంటా తెల్పారు.

ఇవి కూడా చదవండి:చిరు 150వ చిత్రంలో విలన్ అతనా?!

ఇవి కూడా చదవండి:మార్పుని సూచిస్తున్న ఎగ్జిట్ పోల్స్

ఇవి కూడా చదవండి:వెంకయ్యకు గవర్నర్ గిరీ

English summary

Good News For DSC Candidates Andhra Pradesh Education Minister Ganta Srinivasa Rao released AP DSC Schedule and he said that All the selected candidates will get joining by Schools Re opens.