ఏపీ ఎంసెట్ మెడికల్‌ ఫలితాల విడుదల

AP EAMCET Medical results

04:59 PM ON 21st May, 2016 By Mirchi Vilas

AP EAMCET Medical results

ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్‌ 2016 మెడికల్‌ ఫలితాలను శనివారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్‌, ప్రత్తిపాటి పుల్లారావు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తొలి పది ర్యాంకులు సాధించిన విద్యార్థుల వివరాలను సీఎం వెల్లడించారు. గతంలో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ఫలితాలు విడుదల చేసినప్పటికీ నీట్‌ పై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మెడికల్‌ ఫలితాలు వెల్లడించలేదు.

ఇంటర్మీడియట్‌ కాకుండా వేరే బోర్డుల నుంచి ఎంసెట్‌ ప్రవేశ పరీక్షకు హాజరైన 6,669 మంది విద్యార్థులకు వారి ఇంటర్‌ మార్కులు వెల్లడి కాకపోవడంతో ర్యాంకులు కేటాయించలేదని ఏపీ ఎంసెట్‌ కన్వీనర్‌ తెలిపారు. వారి మార్కులు అందజేసిన వెంటనే ర్యాంకుల కేటాయింపు జరుగుతుందని వెల్లడించారు.

26లోగా అభ్యంతరాలు...

మే 21వ తేదీ నుంచి ఓఎంఆర్‌ షీట్‌లను ఏపీఎంసెట్‌.ఓఆర్‌జీ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని, వీటి పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే పరిశీలించుకోవడానికి ఈనెల 26వ తేదీలోగా జనరల్‌ కేటగిరీ విద్యార్థులు రూ.5000, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.2000 రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని ఎంసెట్‌ కన్వీనర్‌ తెలిపారు.

టాప్ 10 రాంకర్లు..

ఎంసెట్‌ మెడికల్‌లో టాప్‌ 10 ర్యాంకులు సాధించిన విద్యార్థుల వివరాలు ఇలా వున్నాయి..

ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి:


English summary

AP EAMCET Medical results