ప్రజాకర్షక  పధకాలు -  ఆ కిక్కే వేరబ్బా

A.P Festival Schemes

09:25 AM ON 7th January, 2016 By Mirchi Vilas

A.P Festival Schemes

ప్రజలను ఆకట్టుకోడానికి రకరకాల పధకాలు పెడ్తూ , మరోపక్క అన్నిదారుల్లో వడ్డింపులు చేస్తూ, చివరికి సామాన్యులు బతకడమే కష్టంగా మారిపోయే పరిస్థితులు తెస్తున్నారు మన పాలకులు. నిత్యావసర వస్తువులు ఆకాశాన్నంటేస్తుంటే, వాటిని అదుపు చేయడంకంటే, కానుకల పేరిట జాతర చేస్తూ, పబ్లిసిటీ కొట్టేస్తున్నారు. కానీ మరోపక్క వడ్డింపులు మాత్రం సీక్రెట్ గా అయిపోతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలే అమలు కాని దుస్థితి నెలకొంటే కొత్తగా ఈ పధకా లేమిటనే ప్రశ్నలు వస్తున్నా ఏ సర్కార్ అయినా పట్టనట్టే వ్యవహరిస్తోంది. ఇంకా చెప్పాలంటే, ప్రజాకర్షణ కోసం వందల కోట్లు ఖర్చు చేస్తూ, మరోపక్క చిన్నపాటి వసూళ్ళకు యోచన చేస్తూ, మొట్టికాయలు తినడం పరిపాటి అయింది.

ఏపీలో గత ఏడాది ప్రవేశపెట్టిన చంద్రన్న సంక్రాంతి కానుక ఎంత పెద్ద హిట్ అయింది. పండగ నాడు పప్పన్నం తినాలనే కాన్సెప్ట్ తో పేదలకోసం ఈ పధకాన్ని అమలు చేసారు. అదే మార్కెట్ లో నిత్యావసర ధరలకు కళ్ళెం వేస్తే, అందరికీ పండగే అవుతుందనే ఆలోచన చేయడం లేదని పలువురు విమర్శించారు. ఇక ఈ పధకంలో అవినీతి గురించి విపక్షాల విమర్శలు సరే సరి. ఏది ఏమైనా అప్పటికప్పుడు అనుకుని చేసిన చంద్రన్న సంక్రాంతి కానుక పథకంలో అక్కడక్కడా ఇబ్బందులు వచ్చినా 90 శాతానికి పైగా సక్సెస్ వచ్చంది.

పేదలు పండుగ చేసుకోవాలన్న లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ పథకానికి మంచి ఆదరణ కనిపించడంతో, ఇదే బాగుందని, మిగిలిన పండగలపై కూడా దృష్టి సారించి, రంజాన్ కు తోఫా... క్రిస్ మస్ కు కానుకలు కూడా ఇచ్చారు. ఈ ఏడాది కూడా చంద్రబాబు సంక్రాంతి కానుకలు ఇచ్చేస్తున్నారు. ఇక ప్రజాదరణ పథకాలంటే పడిచచ్చే తమిళనాడు కూడా దీనిపై కన్నేసింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రంగంలో దిగిపోయారు.

ఇప్పటికే అమ్మ క్యాంటీన్ల వంటి వాటితో ఆకట్టుకుంటున్న జయలలిత సంక్రాంతి కానుక పథకాన్నీ ప్రకటించారు. దానికి ఏపీలోని చంద్రన్న సంక్రాంతి కానుకే స్పూర్తి. అయితే... జయలలిత ఈ విషయంలో చంద్రబాబు కంటే జయమ్మ ఓ అడుగు ముందుకేసి, బియ్యం - పంచదార - పప్పులు వంటి సరకుల తోపాటు రూ.100 నగదు కానుక కూడా అందించేస్తున్నారు.

ఎపిలో ఎన్నో ఇబ్బందులు వున్నాయి. నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం అందరూ తలో చేయీ వేయాలని సిఎమ్ చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. అంతేకాదు ప్రతి విద్యార్థి నుంచి రూ.10 సేకరించాలన్న ఆలోచన చేసారు.రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల సేకరణలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి ఇవ్వాలని విద్యాశాఖ కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు. .అయితే ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది..

పలువురు హైకోర్టును ఆశ్రయించగా కోర్టు ఆ ఫిర్యాదులను స్వీకరించి విచారణ చేపట్టింది. విద్యార్థులు తప్పనిసరిగా రూ.10 చెల్లించాలని విద్యాశాఖ ఎలా ఆదేశిస్తుందని న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ నిర్ణయం సరికాదని పేర్కొంటూ ఉత్తర్వులపై స్టే విధించింది. రాజధాని నిర్మాణం కోసం రూ.10 ఇవ్వాల్సిందేనని ఆదేశాలు ఇవ్వడంపై ప్రతిపక్షాలు - ప్రజా సంఘాలు - విద్యార్థి సంఘాలు - ప్రజాస్వామ్యవాదుల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చాయి. అయినా వెనక్కి తగ్గకపోవడంతో పలువురు కోర్టును ఆశ్రయించే స్థాయికి పరిస్థితి చేరింది. ఫలితం రివర్స్ అయింది.

చంద్రన్న సంక్రాంతి కానుకలో నాసిరకం వస్తువులు సరఫరా చేస్తున్నారన్న వార్తలు రావడం, సిఎమ్ చంద్రబాబు స్పందించి చర్యలకు దిగడం తెల్సిందే. మరోపక్క విపక్షాల విమర్శలు. అదే నిత్యావసర ధరలు అదుపులో ఉంచితే , ప్రజాకర్షక పధకాల వైపు చూడాల్సిన అవసరం ఉండదని, అందరికీ పండగే అవుతుందని, ఇలాంటి పధకాలకు విచ్చేంచే డబ్బునే రాజధాని నిర్మాణానికి మళ్ళించ వచ్చని పలువురి వాదన. ఎవరు ఎన్ని అనుకున్నా,, ఎన్ని వ్యాఖ్యలు - విమర్శలు చేసినా, ప్రజాకర్షక పధకాలకు వచ్చే రెస్పాన్స్ తో వచ్చే ఆ కిక్కే వేరబ్బా

English summary

Andhra Pradesh Government was giving some of the dialy needs to poor people in ration shops.Now A.P government has decided to take 10 rupees from every student for amaravathi construction but high court was opposed this decision