లవ్ ఫెస్టివల్ యవ్వారంపై సర్కార్ ఏమంది?

AP government back track for love festival in Vizag

11:48 AM ON 5th November, 2016 By Mirchi Vilas

AP government back track for love festival in Vizag

గత రెండు మూడు రోజులుగా హాట్ టాపిక్ గా మారిన వైజాగ్ లవ్ ఫెస్టివల్ యవ్వారంపై ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ ఫెస్టివల్ కు, ప్రభుత్వానికి సంబంధం లేదని, దీనికి సీఎం సహా మంత్రులెవరూ హాజరుకావడం లేదని మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ ఫెస్టివల్ విషయమై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. దీని అనుమతి కోసం గోవాకు చెందిన కొందరు ప్రైవేటు వ్యక్తులు విశాఖ కార్పొరేషన్ కు- పర్యాటక శాఖకు దరఖాస్తు చేసినట్టు తెలిసిందని, ఆ ఫెస్టివల్ మన సంస్కృతికి విరుద్దమని తేలితే అనుమతి ఇవ్వబోమని మంత్రి అన్నారు. అటు టీడీపీ నేత బోండా ఉమ కూడా వైసీపీ ఆరోపణలను తోసిపుచ్చారు.

కాగా ప్రేమికుల రోజున పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరిలో విశాఖలో బీచ్ లవ్ ఫెస్టివల్ నిర్వహణకు పూనుకోవడం సముచితం కాదని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానిస్తూ, ఈ బీచ్ ఫెస్టివల్ ని అడ్డుకుంటామని వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా హెచ్చరించారు. దీనిపై పునరాలోచించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఫెస్టివల్ కు 9 వేల మంది ప్రేమికులను ఇతర దేశాల నుంచి ఆహ్వానించి వారికి విశాలమైన గుడారాలను ఏర్పాటు చేస్తారని, భారీ ఎత్తున ప్రదర్శన నిర్వహించేలా చూస్తున్నట్లు వార్తలొస్తున్నాయని ఆయన అన్నారు.

English summary

AP government back track for love festival in Vizag