పుష్కర ఆహ్వానంతో సంపూ .. కేక

AP Government Invites Sampoornesh Babu To Krishna Pushkaralu

10:34 AM ON 9th August, 2016 By Mirchi Vilas

AP Government Invites Sampoornesh Babu To Krishna Pushkaralu

హృదయకాలేయం చిత్రంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన డిఫరెంట్ హీరో సంపూర్ణేశ్ బాబు ఒకనాడు తెలుగులో హిట్ సాధించిన చిత్రాలను స్పూఫ్ చేస్తూ..సినిమాలు తీసి అలరించాడు. సంపూ అనే ముద్దుగా అభిమానుల చేత పిలిపించుకునే, ఇతగాడు క్రేజ్ మామూలుగా లేదు. తెలుగు సినీ అభిమానులకు టాప్ హీరోల సినిమాల కోసం ఎంతగా ఎదురుచూస్తారో.. సంపూ చిత్రాల కోసం కూడా అలాగే ఎదురుచూస్తారు. అటువంటి సంపూర్ణేశ్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుష్కరాలకు ఆహ్వానం పంపింది. ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 12నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఈ పుష్కరాలకు ఆహ్వానిస్తూ తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది. దీనిలో భాగంగా సంపూర్ణేశ్ బాబుకు కూడా ఆహ్వానం అందింది. ఈ విషయాన్ని సంపూ తన ట్విటర్ ద్వారా తెలియజేశాడు. అంతేకాదు, ఏపీ ప్రభుత్వం నుంచి తనకు ఆహ్వానం రావడంతో సంపూ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తనను పుష్కరాలకు ఆహ్వానించిన ఏపీ ప్రభుత్వానికి ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇక కృష్ణ పుష్కరాలకు కూడా వస్తాడని తెలుస్తోంది.

English summary

Andhra Pradesh Government was taken Krishna Pushkaralu prestigiously and Andhra Pradesh Government was invited some popular people in Telugu States and Sampoornesh Babu shared this news via Twitter and shared his happiness.