రోజా వ్యవహారంపై అప్పీలు - సోమవారం విచారణ

AP Government To Appeal In High Court On Roja Issue

12:48 PM ON 18th March, 2016 By Mirchi Vilas

AP Government To Appeal In High Court On Roja Issue

వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్సెన్సన్ వ్యవహారంపై హైకోర్టు డివిజన్ బెంచ్ ఎదుట అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. రోజా అనుచిత ప్రవర్తన వల్లే చర్యలు తీసుకున్నామని, స్పీకర్ ఒక్కరే కాదు సభ మొత్తం కలిసి రోజా సస్పెన్షన్‌పై నిర్ణయం తీసుకుందని, ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై కోర్టు సోమవారం విచారణ జరుపనుంది. మరోవైపు సభలోకి అనుమతించే విధంగా హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ రోజాను అనుమతించడంలేదని ఆమె తరపు లాయర్ పేర్కొన్నారు.

1/4 Pages

అసెంబ్లీకి రోజా వచ్చినా...

కాగా ఏపీ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైకోర్టు తన సస్పెన్షన్‌ను కొట్టివేయడంతో వైసీపీ ఎమ్మెల్యే రోజా శుక్రవారం ఉదయం అసెంబ్లీకి రాగా, అసెంబ్లీ గేట్ నెంబర్ 3వద్ద మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో భద్రాతా సిబ్బందితో రోజా, వైఎస్ జగన్ వాగ్వాదానికి దిగారు.'సభలోకి రోజా వెళ్లొచ్చని తమ దగ్గర కోర్టు ఆదేశాలున్నాయని,వద్దనడానికి మీ దగ్గర ఏం ఆధారాలున్నాయా' అని  మార్షల్స్‌ను జగన్ ప్రశ్నించారు. అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్‌ ఆదేశాలే తమకు శిరోధార్యం జగన్‌కు స్పష్టం చేశారు. దీంతో జగన్, రోజా, వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వద్ద బైఠాయించిన నిరసనకు దిగారు.

English summary

Ysrcp Suspended Nagari Constitution MLA Roja has been suspended for year from Andhra Pradesh Assembly due her comments on MLA's amd her behaviour in A,dhra Pradesh Assembly.Yesterday High Curt have given Judgement by cancelling Suspension On Roja. But Andhra Pradesh Assembly Speaker Did not allow her to Assembly Sessions and Andhra Pradesh Government Has decided to Appeal in High Court on Roja Issue.