అబ్బబ్బో ... హోదా గురించి మంత్రి గారు ఏం చెప్పారండి

AP Minister Manikyala Rao On Special Status To AP

11:06 AM ON 5th August, 2016 By Mirchi Vilas

AP Minister Manikyala Rao On Special Status To AP

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎపి ప్రత్యేక హోదా గురించే చర్చ. ఈ సెంటిమెంట్ గుబులు పుట్టిస్తోంది. అందుకే ఆంధ్రప్రదేశ్ ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. వైసిపి బంద్ పిలుపుకి వామ పక్షాలు, కాంగ్రెస్ కూడా మద్దతు పలికాయి. అయితే టిడిపి ప్రభుత్వంలో మంత్రిగా వున్న బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ అవసరం లేదని ఒక్క ముక్కలో తేల్చేశారాయన. ప్రత్యేకహోదా అనేది వరకట్నం లాంటిదని, దానిని 14వ ఆర్థిక సంఘం కట్ చేసిందని అందువల్లే ఇవ్వడం కుదరదని సెలవిచ్చారు. ఏపీని స్పెషల్ స్టేటస్ గా కాకుండా స్పెషల్ స్టేట్ గా మోదీ సర్కార్ గుర్తించిందని, అందుకే అన్ని విధాలుగా ఆదుకుంటుందని కూడా మంత్రి మాణిక్యాలరావు అంటున్నారు.

కొద్దిరోజుల కిందట ఏపీ బీజేపీ నేతలు కూడా హోదాపై ఇలాగే చెప్పుకొచ్చారు. ఏపీకి హోదా, రాజధాని నిర్మాణం విషయంలో దేశంలో ఇప్పటివరకు విభజించిన ఏ రాష్ర్టానికి కేంద్రం ఇవ్వలేదని, స్వయంగా ఎదిగాయని గుర్తు చేశారు. మొత్తానికి హోదా విషయంలో ఏపీ బీజేపీ నేతలు మెల్లగా స్వరం పెంచుతున్నారని అనుకోవచ్చా. మరి ఈ అంశం గురించి ప్రజల్లో గల సెంటిమెంట్ ని ఎలా అధిగమిస్తారా చూడాలి.

ఇవి కూడా చదవండి:చక్కన్నమ్మకి ఏ గాలి సోకిందో...

ఇవి కూడా చదవండి:ఇకపై స్మార్ట్ ఫోన్ తో వీర్యకణాలు చెక్ చేసుకోవచ్చు!

English summary

Andhra Pradesh BJP MLA and Minister Manikyala Rao says that BJP government was seeing Andhra Pradesh as Special State and there is no need of Special Status to Andhra Pradesh.