డబ్బున్న మంత్రుల్లో నెంబర్ వన్ ఈయనే..

AP Minister Narayana as Richest Minister In India

11:01 AM ON 6th August, 2016 By Mirchi Vilas

AP Minister Narayana as Richest Minister In India

అవును దేశంలో అత్యంత డబ్బున్న మంత్రుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖామంత్రి పి.నారాయణ ఫస్ట్ ప్లేస్ ఆక్రమించారు. నారాయణ విద్యా సంస్థల అధిపతి నుంచి రాష్ట్ర మంత్రిగా ఎదిగిన ఈయన ఇప్పుడు డబ్బున్న మంత్రుల్లో నంబర్ వన్ గా రికార్డు సృష్టించారు. ఈయన మొత్తం ఆస్తి విలువ రూ.496 కోట్లు. ఏపీలోని మరో 20 మంది మంత్రులు కూడా ఆదాయం, ఆస్తుల్లో ముందంజలో ఉండడం గమనార్హం.

ఢిల్లీకి చెందిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్(ఏడీఆర్) అనే సంస్థ దేశంలోని 29 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 609 మంది మంత్రుల ఆదాయంపై చేసిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. ఇందులో 76శాతం మినిస్టర్స్ అంటే 462 మంది కోటీశ్వరులేనని తేలింది. అత్యధిక ఆదాయం కలిగిన మంత్రుల్లో కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ రూ.251 కోట్లతో రెండోస్థానం. ఇక కర్ణాటకలో ముగ్గురు మంత్రుల తప్ప మిగిలినవారంతా కోట్లకు పడగలెత్తిన మంత్రులే కావడం విశేషం.

ఇక అరుణాచల్ ప్రదేశ్ , పంజాబ్ , పుదుచ్చేరి మంత్రులందరూ కోటీశ్వరులే! మొత్తం మంత్రుల్లో మధ్యప్రదేశ్, తమిళనాడు చెందిన 51 మంది మహిళా మంత్రులు కోటీశ్వరుల జాబితాలో ఉన్నారు. ఓవరాల్ గా చూస్తే ఏపీకి చెందిన 20 మంది మంత్రుల సరాసరి ఆస్తులు రూ. 45.49 కోట్లు కాగా, కర్ణాటకకు చెందిన 31 మంది మంత్రుల సరాసరి ఆస్తులు రూ.36.96 కోట్లు కావడం గమనార్హం.

క్రిమినల్ కేసుల్లో తెలంగాణా థర్డ్ ప్లేస్..

ఇక క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న మంత్రుల రాష్ర్టాల్లో తెలంగాణ థర్డ్ ఫ్లేస్ లో చేరింది. వివిధ రాష్ట్రాలకు చెందిన 210 మంది మంత్రులు క్రిమినల్ కేసులు ఎదుర్కోగా, 113 మందిపై కిడ్నాప్, హత్య కేసులు ఉన్నాయి. ఈ విషయంలో 18 మందితో మహారాష్ట్ర టాప్ లో ఉండగా, ఆ తర్వాత బీహార్-11, జార్ఖండ్-9, తెలంగాణ-9, ఢిల్లీ-4, ఉత్తరాఖండ్ ఇద్దరు ఎమ్మెల్యేలు వున్నారు.

మొత్తానికి ఈ రిపోర్ట్ పై సోషల్ మీడియాలో సెటైర్లు పడిపోతున్నాయి. కోట్లకు పగడలెత్తిన మంత్రులు సైతం గ్యాస్ సబ్సిడీని ఎందుకు వదులుకోవడం లేదు? అన్నింటిలోనూ రాయితీలు ఎందుకు? లక్షల కొద్దీ జీతాలు ఎందుకు తీసుకుంటున్నారంటూ సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:అసోం లో విరుచుకుపడిన ఉగ్రవాదులు

ఇవి కూడా చదవండి:గ్రాండ్ ఓపెనింగ్.. రియోలో ఒలంపిక్స్

English summary

Andhra Pradesh Municipal Minister and Narayana Educational Institutions Chairman Narayana stood as the richest minister in India. According to a survey Narayana assets costs was 496 crores.