20 ఎకరాల్లో ఎపి సచివాలయం 

A.P Secretariat To Build In 20 Acres

03:45 PM ON 29th December, 2015 By Mirchi Vilas

A.P Secretariat To Build In 20 Acres

వచ్చే ఏడాది నుంచి పాలన అమరావతి నుంచే చేపట్టాలని సిఎమ్ చంద్రబాబు నిర్ణయించడంతో చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇందులో భాగంగా అమరావతి టౌన్ షిప్‌లో తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి సీఆర్డీఏ చర్యలు చేపట్టేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఇరవై ఎకరాల్లో 6 లక్షల చదరపు అడుగుల కార్యాలయ భవనాల నిర్మాణం చేపట్టేందుకు ఆమోదించింది. అయితే జూన్ 30వ తేదీని డెడ్ లైన్‌గా విధించింది.

ఇందుకు రూ.180 కోట్ల వ్యయం అవుతుంది. , ఇందులో వడ్డీలేని రుణం గా రూ.90కోట్లు ప్రభుత్వం ఇస్తుంది. మిగిలిన రూ.90కోట్లు హడ్కో నుంచి రుణం పొందాల్సి వుంటుంది. . వివిధ విభాగాలకు కేటాయించిన కార్యాలయ వసతి ఆధారంగా వారి సాధారణ బడ్జెట్‌ నుంచి అద్దెను చెల్లించాల్సి వుంటుంది. మరి అనుకున్న సమయానికి అన్నీ అవుతాయా అన్నది చేపట్టే పనిని బట్టి వుంటుంది.

English summary