కేటీఆర్ కి షాకిచ్చిన ఏపీ విద్యార్థి

AP student gave shock to KTR

11:53 AM ON 10th June, 2016 By Mirchi Vilas

AP student gave shock to KTR

అవునా అవును మరి. సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతటి వారికైనా షాక్ ఇచ్చేయచ్చు. సరిగ్గా సోషల్ మీడియాలో ఓ ఏపీ విద్యార్థి తెలంగాణ మంత్రి, కేసీఆర్ తనయుడు కేటీఆర్ కు గట్టి షాకే ఇచ్చాడు. అయితే తన పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ విద్యార్థి తాను ఏపీ రాష్ట్రానికి చెందిన విద్యార్థిగా మాత్రం చెప్పినట్టు తెలుస్తోంది. ఇక ఏపీ విద్యార్థి రాసిన లేఖలో విషయాలను ఓ సారి గమనిస్తే ఎక్కడికి వెళ్లినా దేశంలోని యంగెస్ట్ స్టేట్(మొన్నీమధ్యే జన్మించిన రాష్ట్రం) తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని కేటీఆర్ చెప్పడాన్ని ఏపీ విద్యార్థి తప్పుబట్టాడు. ఇందుకు అనేక కారణాలు కూడా ఆ విద్యార్థి వెల్లడించారు.

అప్పుడే పుట్టిన రాష్ట్రం మొదటి రోజు నుంచే స్వయం పాలన ఎలా సాగిస్తుందని ప్రశ్నించిన ఏపీ విద్యార్థి అప్పుడే పుట్టిన రాష్ట్రంలో అభివృద్ధి చెందిన రాజధాని, ఐటీ కంపెనీలు, మెట్రో రైలు వంటి మెగా ప్రాజెక్టులు ఎలా ఉంటాయని ప్రశ్నించాడు. ప్రపంచంలో ఎక్కడైనా అప్పుడే పుట్టిన రాష్ట్రం ఆర్ధికంగా నిలదొక్కుకోవడానికి ఇబ్బంది పడుతుందని కానీ తెలంగాణ మాత్రం మిగులు బడ్జెట్ తో ఏర్పడి అభివృద్ధి వైపు పరుగులు తీస్తోందని ఏపీకి చెందిన ఆ విద్యార్థి వివరించాడు. తాను కేటీఆర్ ప్రసంగాలను ఇష్టపడతానని కానీ ఆయన పదే పదే తెలంగాణ యంగెస్ట్ స్టేట్ అని చెప్పడాన్ని మాత్రం అంగీకరించనని ఆ విద్యార్ధి కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. మరి ఊరు, పేరు చెప్పని ఏపీ విద్యార్థి రాసిన లేఖకు కేటీఆర్ రెస్పాన్స్ ఎలా వుంటుందో చూడాలి.

English summary

AP student gave shock to KTR