కేంద్రంపై కారాలు మిరియాలు

AP TDP Leaders Requests BJP For Special Status

12:33 PM ON 5th May, 2016 By Mirchi Vilas

AP TDP Leaders Requests BJP For Special Status

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని అంటూ కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి జయంతసిన్హా చేసిన ప్రకటన నేపధ్యంలో టిడిపి నేతలతో సహా పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఓ విధంగా కేంద్రం ప్రకటన రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించింది. ఆనాడు రాజ్యసభలో 'ఐదేళ్లు సరిపోదు.. పదేళ్లపాటు ఏపీకి ప్రత్యేక హోదా కావాలి' అని డిమాండ్‌ చేసిన బీజేపీ నేతలు అధికారంలోకి వచ్చాక.. మాట మార్చడం శోచనీయమని పలువురు మండిపడ్డారు. టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఆంధ్రప్రదేశ గడ్డుకాలం ఎదుర్కొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ప్రధాని మన్మోహనసింగ్‌, ప్రతిపక్షంలో ఉన్న వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కోసం తాము తీవ్రంగా కృషి చేస్తున్నామని చెప్పారు.

ఇవి కూడా చదవండి:ప్రధాని హామీకి విలువ లేదా?

హోదాపై కేంద్రం లేఖ టీడీపీ, బీజేపీల వైఫల్యం కాదని, హోదా సాధనకు ఇంకా మూడేళ్ల సమయం ఉందని టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్‌ అన్నారు. హోదా ఇస్తారన్న నమ్మకం ఉందని, బీజేపీని లక్ష్యంగా చేసుకుంటే తమకు ఒరిగేదేమీ ఉండదని, కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకువస్తే తమకు అపాయింట్‌మెంట్‌ కూడా దొరకదని వ్యాఖ్యానించారు. ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కని మంత్రి నారాయణ అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి లేఖను ఖండించారు. ప్రత్యేక హోదా సమస్యను జఠిలం చేసింది కాంగ్రెస్‌ పార్టీయేనని, ఈ విషయంలో కాంగ్రెస్‌ మొదటి ముద్దాయని విమర్శించారు.

ఇవి కూడా చదవండి:అత్తారింటికి వెళ్తున్నపవర్ స్టార్

కాగా, విభజన సమయంలో పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని వెంటనే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని బతిమాలుతున్నామని డొక్కా మాణిక్య వరప్రసాద్‌ చెప్పారు. అదే విధంగా ప్రత్యేక ప్యాకేజ్‌ను ప్రకటించాలన్నారు. నీతి ఆయోగ్‌ నివేదికను పక్కనపెట్టి ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరారు. ప్రత్యేక హోదాపై కేంద్రం మాట మార్చడం సరికాదని రాష్ట్ర మంత్రి పీతల సుజాత అన్నారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకునేందుకు ప్రత్యేక హోదా ఇవ్వాలని చేతులెత్తి నమస్కరిస్తున్నామన్నారు.

ఇవి కూడా చదవండి:బికినీ ఫోటోషూట్ లో రెచ్చిపోయిన శృతి హాసన్!

English summary

Andhra Pradesh TDP leaders Responds on Letter by Central Minister. TDP leaders requested BJP to Give Special Status and Special Packages to Andhra Pradesh.