అవకాశం ఇస్తానని తన ఇంటికి ఒంటరిగా రమ్మన్నాడు: అపరాజిత ఆధ్యా

Aparajita Adhya sensational comments on producer

05:27 PM ON 19th May, 2016 By Mirchi Vilas

Aparajita Adhya sensational comments on producer

ఆడవాళ్ళకు బయటే కాదు సినీ పరిశ్రమలోనూ మగవాళ్ళ పోరు తప్పడంలేదు. తాజాగా బెంగాలీ టీవీ పరిశ్రమలో ఓ వెలుగు వెలుగుతున్న సినీ హీరోయిన్ అపరాజిత ఆధ్యా కూడా అదే విషయాన్ని బయట పెట్టింది. ముఖ్యంగా బెంగాలీ పరిశ్రమలో ఈ క్యాస్టింగ్ కోచ్ ఎక్కువగా(అవకాశమిస్తామని ప్రొడ్యూసర్లు, దర్శకులు ఇంటికి రమ్మనడం) ఉందని ఆరోపిస్తున్న అపరాజిత.. అందుకు తన జీవితంలో ఎదురైన ఓ ఘటనే సాక్ష్యం అని చెబుతున్నారు. గతంలో ఓ టీవీ సీరియల్లో ఫీమేల్ లీడ్ రోల్ అవకాశం ఇస్తానని చెప్పిన ఆ సీరియల్ ప్రొడ్యూసర్... అందుకోసం తనని ఏకాంతంగా కలవాలని కోరుతూ తన అసిస్టెంట్ ని నా వద్దకు పంపించాడు అని చెప్పుకుని వాపోయింది.

అప్పుడు మా దర్శకుడు జగన్నాథ్ గుహ.. ఆ వచ్చిన అసిస్టెంట్ పై విరుచుకుపడుతూ... ఆమె ఎవ్వరినీ, ఎక్కడా ఏకాంతంగా కలవదు పొమ్మని సీరియస్ గా చెప్పి వెనక్కి పంపించేశాడు అంటూ తనకి ఎదురైన సంఘటనని వివరించింది అపరాజిత. అయితే, ఈమధ్య కాలంలో పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. ఇప్పుడు హీరోయిన్ల ఎంపికలో టీవీ ఛానెళ్లు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. ఓపెన్ ఆడిషన్స్‌లో పాల్గొంటున్నాయి. దీంతో ప్రొడ్యూసర్లకి నేరుగా హీరోయిన్లని కలిసే అవకాశాలు తగ్గిపోయాయి అని అపరాజిత చెబుతున్న మాటలు బెంగాలీ పరిశ్రమలో క్యాస్టింగ్ కోచ్‌ని మరోసారి హైలైట్ చేసాయి. మొత్తం మీద ఆడవాళ్ళ పై మగవాళ్ళ చేసే పోరు ఇక్కడ కూడా ఉందని మరోసారి ఋజువైంది.

English summary

Aparajita Adhya sensational comments on producer