ముఖ కవళికలను అనుకరించే యాప్‌

App Converts Your Face Into An Animated Character On Video Chat

03:19 PM ON 4th January, 2016 By Mirchi Vilas

App Converts Your Face Into An Animated Character On Video Chat

మనలో చాలా మంది ఆన్ లైన్ లో వీడియో కాల్ చేస్తున్నప్పుడు వెబ్క్యామ్ ముందుకు రావడానికి ఇష్టపడరు. కొందరికి ఫేస్‌టుఫేస్‌ మాట్లాడుకోవడం అంటే ఇష్టం. ఒకవేళ ఇలాంటి వారందరూ కలిసి మాట్లాడుకోవాలి అనుకుంటే వారి కోసం ఒక సరికొత్త యాప్‌ వచ్చింది. మనం పెట్టే ముఖ కదలికలను బట్టి ఆ క్యారెక్టర్‌ కూడా మన మనోభావాలను వ్యక్తం చేస్తుంది.

ముందుగా మనం ఆ సాఫ్ట్‌వేర్‌ లోని ఒక 3డి-బొమ్మను ఎంచుకోవాలి. మనం ఎంచుకున్న బొమ్మ మన ముఖ కవళికలను, మన హావభావాలను అనుకరిస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్‌ ను స్కైప్‌, వైబర్‌ ఫేస్‌బుక్‌ లోని వీడియో కాల్స్‌ చేసినప్పుడు ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఈ సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి దశలో ఉంది. ఈ అద్భుతమైన సాఫ్ట్‌వేర్‌ను కేవలం 5 డాలర్ల వెచ్చించి మనం కొనుగోలు చెయ్యవచ్చు.

ఈ యాప్‌ను ఉపయోగించి మన హావ భావాలను ఎలా వ్యక్తపరుచవచ్చో వీడియోలో చూడచ్చు.

English summary

New App has been introduced that Converts Your Face Into An Animated Character Over Video Chat on facebook,skype,viber etc