అన్నింటినీ కంట్రోల్ చేసే యాప్

App That Control Smart Objects

05:02 PM ON 15th December, 2015 By Mirchi Vilas

App That Control Smart Objects

ఇంట్లో లైటింగ్ తగ్గించగానే ఆటోమాటిక్ గా టీవీ సౌండ్ తగ్గిపోవడం.. ఆఫీసు నుంచి బయలుదేరేముందు కారు ఎక్కగానే ఇంట్లో ఏసీ ఆన్ కావడం.. ఇలాంటి ఫీట్లన్నీ ఒకే ఒక్క యాప్ తో సాధ్యం అంటున్నారు అమెరికా పరిశోధకులు. ఎన్నో రకాల పనులను అలవోకగా చేయగలిగేలా స్మార్ట్ యాప్‌ను మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు రూపొందించారు. అగ్‌మెంటెడ్ రియాలిటీ యాప్‌గా పిలవబడుతున్న ఈ న్యూజెన్ రియాలిటీ ఎడిటర్ అప్లికేషన్‌ను నివాసాల్లోని స్మార్ట్ వస్తువులను ఆటోమేటిక్‌గా నియంత్రించేలా అభివృద్ధి చేశారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెల్లిజెన్స్, బిగ్ డేటాకు ఒక మచ్చు తునకగా భావిస్తున్న ఈ యాప్‌లో ఒక ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డివైస్‌లో యూజర్ గీసే సింబల్స్, గెస్చర్స్‌ను ఈ సెన్సార్ రీడ్ చేసి ఇంటర్నెట్ ద్వారా నివాసంలోని స్మార్ట్ ఆబ్జెక్ట్ కంట్రోల్ సెంటర్‌కు పంపిస్తుంది. దీని ద్వారా ఆటోమేటిక్‌గా ఆయా పనులు చేయబడతాయి. ప్రస్తుతం ఈ యాప్ బెటా స్టేజ్‌లోనే ఉందని, త్వరలోనే దీన్ని మరింత సమర్థవంతంగా పనిచేసేలా అభివృద్ధి చేసి యూజర్లకు అందుబాటులోకి తేనున్నామని ఎంఐటీ పరిశోధకులు చెబుతున్నారు.

English summary

The Reality Editor is a new kind of tool for empowering you to connect and manipulate the functionality of physical objects. Just point the camera of your smartphone at an object and its invisible capabilities will become visible for you to edit