సైనస్ ఇన్ఫెక్షన్ తగ్గించుకోవటానికి ఆపిల్ సైడర్ వినెగర్

Apple Cider for sinus problem

04:13 PM ON 3rd March, 2016 By Mirchi Vilas

Apple Cider for sinus problem

సైనస్ ఇన్ఫెక్షన్ ను వైద్య పరంగా  సైనసిటిస్ అని పిలుస్తారు. నాసికా కుహరంలో వాపు కారణంగా ఈ పరిస్థితి వస్తుంది. నాసికా కుహరంలో బాక్టీరియా పెరిగి తరచూ రొంప మరియు నొప్పి వస్తుంది. సైనస్ ఇన్ఫెక్షన్ తో బాధ పడుతున్న వారిలో ముఖం, ముక్కు మరియు కళ్ళ చుట్టూ ఒత్తిడి గా అనిపిస్తుంది. అలాగే తలనొప్పి, నాసికా రద్దీ, ముక్కు నుండి దళసరి పసుపు ద్రవం విడుదల,జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉంటాయి.

సైనస్ ఇన్ఫెక్షన్ నివారణకు మార్కెట్లో అనేక మందులు అందుబాటులో ఉన్నాయి కానీ వాటిలో చాలా వరకు ఇన్ ఫెక్షన్ తగ్గించటానికి సహాయపడవు. అలాగే కొన్నిసార్లు దుష్ప్రభావాలకు కారణం అవుతాయి.అందువల్ల ఆపిల్ సైడర్ వినెగర్ ని ఉపయోగించి సైనస్ ఇన్ఫెక్షన్ ని సమర్ధవంతంగా తరిమి కొట్టవచ్చు.

ఆపిల్ సైడర్ వినెగర్ లో విటమిన్ E, A, B1, B2 విటమిన్లు, కాల్షియం మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలు సమృద్దిగా ఉండుట వలన సైనస్ ఇన్ఫెక్షన్ తగ్గించటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఆపిల్ సైడర్ వినెగర్ మీ ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

1/7 Pages

1. ఆపిల్ సైడర్ వినెగర్

సైనస్ ఇన్ఫెక్షన్ ని సులభంగా మరియు సమర్ధవంతంగా తగ్గించే ఇంటి నివారణలో ఇది ఒకటి అని చెప్పవచ్చు.

కావలసినవి

ఆపిల్ సైడర్ వినెగర్ - 1 స్పూన్

పద్దతి

* ప్రతి రోజు ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వినెగర్ ని రోజులో మూడు సార్లు తీసుకుంటే సైనస్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.
* ఆపిల్ సైడర్ వినెగర్ ని ఉపయోగించటం వలన సైనస్ ఇన్ఫెక్షన్ ని నయంచేయటమే కాకుండా మరల రాకుండా చేస్తుంది.

English summary

In this article, we have listed about uses of apple cider. Sinus is caused due to the inflammation and swelling of sinuses. This situation blocks the sinuses with fluid on which the bacteria grow and that often brings nasal congestion and pain.