ఇండియా లో  ఆపిల్ బిలియన్ డాలర్ల పంట 

Apple crosses 1-billion dollars sales mark in India

05:44 PM ON 20th November, 2015 By Mirchi Vilas

Apple crosses 1-billion dollars sales mark in India

ప్రపంచవ్యాప్తంగా ఆపిల్‌ కంపెనీ ఉత్పత్తులకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఒక కొత్త ఆపిల్‌ ఫోన్‌ విడుదలైందంటే చాలు ఆ ఫోన్ ను దక్కించుకోవడానికి రోజుల తరబడి క్యూలో నిలబడుతుంటారు.
తాజాగా ఆపిల్‌ కంపెనీ భారత్‌ దేశంలో తొలిసారిగా 1 బిలియన్‌ డాలర్ల అమ్మకాలను అందుకోగలిగింది. ఈ విషయాన్ని రిజిష్టర్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్‌ఓసి) వారు తెలిపారు.
ఆర్‌ఓసి వారి నివేదిక ప్రకారం ఆపిల్‌ ఉత్పత్తులైన ఐఫోన్‌,ఐప్యాడ్‌ ల అమ్మకాలు 44 శాతం పెరిగాయి.


గతంలో 4500.35 కోట్లు ఉన్న దీని అమ్మకాల విలువ ఇప్పుడు 6,472.89 కోట్లకు పెరిగింది. గతంతో పోలిస్తే ఆపిల్‌ సంస్థ వారి నికార లాభం 119.48 కోట్ల నుండి 242.58 కోట్ల తో రెట్టింపయ్యింది. భారత్‌ లో ఆపిల్‌ ఉత్పత్తుల అమ్మకాలు గత రెండేళ్ళలో రెట్టింపయ్యాయని తెలిపింది . గత రెండేళ్ళలో ఆపిల్‌ సంస్థకు 3,057.79 కోట్ల లాభాలు భారత్‌ నుండి వచ్చాయని తెలిపింది. ఆపిల్‌ సంస్థ 2012 నుండి భారత్‌ లో అమ్మకాలను పెంచుకోవడానికి వివిధ వాణిజ్య ప్రకటనలు రిటైల్‌ డిస్టిబ్యూటర్లతో గత రెండేళ్ళలో భారత్‌ మెబైల్‌ మార్కెట్లో 9% వాటాలను సాధించింది.

భారత్‌ లో సామ్‌సంగ్‌,మైక్రోమాక్స్‌ల తరువాత మూడో స్థానంలో ఆపిల్‌ కొనసాగుతుండడం విశేషం.

English summary

Apple crossed the $1-billion sales mark in Indian operations for the first time in the year ended March