21న ఐఫోన్ ఎస్ఈ విడుదల

Apple iPhone 5SE to launch on March 21

04:30 PM ON 2nd March, 2016 By Mirchi Vilas

Apple iPhone 5SE to launch on March 21

ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ యాపిల్‌ మరో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసేందుకు సిద్దమైంది. తన కొత్త నాలుగు అంగుళాల ఐఫోన్‌ 5ఎస్‌ఈ స్మార్ట్ ఫోన్ ను ఈ నెల 21న రిలీజ్ చేయనుంది. ఇంతకుముందు ఈ ఫోన్ ను మార్చి 15న విడుదల చేయనున్నట్టు యాపిల్ ప్రకటించింది. ఇప్పుడు ఆ కార్యక్రమం వారం రోజులు ఆలస్యంగా 21న విడుదలకానున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్‌ 5ఎస్‌కు కొత్త వెర్షన్‌గా ఐఫోన్‌ 5ఎస్‌ఈ మోడల్‌ను నాలుగు అంగుళాల తెరతో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వెర్షన్‌ పేరులో 5 తీసేసి ఐఫోన్‌ ఎస్‌ఈ పేరుతో ఈ ఫోన్‌ విడుదల చేసే అవకాశముందని సమాచారం. దీన్ని 400 నుంచి 500 డాలర్ల ధరతో యూజర్లకు అందుబాటులోకి తేనున్నట్టు సమాచారం. ఐఫోన్ ఎస్‌ఈలో 12 మెగాపిక్సల్ రియర్ కెమెరా, కర్వ్‌డ్ 2.5 డి గ్లాస్, 16/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 1642 ఎంఏహెచ్ బ్యాటరీ, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 4.2 వంటి ఫీచర్లను అందించనున్నారని తెలుస్తోంది.

English summary

Apple Company to launch a new smart phone called iPhone 5 SE on March 21st.This smartphone comes with the key features like 4-inch display,12 megapixel camera,16/64 GB Memory,curved 2.5D glass display.