చైనాలోనూ యాపిల్‌ పే

Apple Pay launches in China

04:13 PM ON 18th February, 2016 By Mirchi Vilas

Apple Pay launches in China

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ యాపిల్‌ చైనాలోనూ మొబైల్‌ పేమెంట్స్‌ సర్వీస్‌ యాపిల్‌ పేను ప్రారంభించింది. యాపిల్‌ పే ప్రస్తుతం అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లోనే అందుబాటులో ఉంది. తాజాగా చైనాలో ప్రవేశపెట్టారు. చైనాలో యాపిల్‌ పే ఎలా పనిచేస్తుందో చూడడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ చైనా మైక్రోబ్లాగింగ్‌ సైట్‌లో పోస్ట్‌ చేశారు. చైనాలో ఇప్పటికే ఇతర మొబైల్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ అందుబాటులో ఉన్నాయి. వాటితో పాటు యాపిల్‌ కూడా చేరనుంది. గత ఏడాది చైనాలో మొబైల్‌ ద్వారా 9.31 ట్రిలియన్‌ యువాన్లు(1.4 ట్రిలియన్‌ డాలర్లు) నగదు బదిలీ జరిగింది. అక్కడ ప్రఖ్యాత ఈ-కామర్స్‌ సంస్థ అలీబాబా అతిపెద్ద ఆన్‌లైన్‌ పేమెంట్‌ ప్రొవైడర్‌. చైనాలో యాపిల్‌ బ్రాండ్‌కు, ఐఫోన్లకు మంచి డిమాండ్‌ ఉన్నందున యాపిల్‌ పే కూడా విజయవంతమవుతుందని సంస్థ ఆశలు పెట్టుకుంది.

English summary

pple Inc launched its mobile payment system in China on Thursday in a bid to convince the hundreds of millions of users of the country's entrenched, dominant services to switch.