త్వరలో.. యాపిల్‌ కార్లు?

Apple Registers Apple.car Domain Names

04:04 PM ON 11th January, 2016 By Mirchi Vilas

Apple Registers Apple.car Domain Names

ఐఫోన్‌.. ఐవాచ్.. ఐటీవీ.. ఐపాడ్.. మ్యాక్ బుక్.. మొదలైన ఉత్పత్తులతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన సంస్థ యాపిల్‌. ఎలక్ట్రానిక్స్ విభాగంలో సూపర్ సక్సెస్ సాధించిన యాపిల్ త్వరలోనే ఆటోమొబైల్‌ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. గత నెలలో యాపిల్‌.కార్‌, యాపిల్‌.కార్స్‌, యాపిల్‌.ఆటో పేర్లతో యాపిల్‌ డొమైన్‌ పేర్లను రిజిస్టర్‌ చేసుకుంది. మాక్‌ర్యూమర్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే ఈ డొమైన్లు యాపిల్‌ కార్‌ప్లే కోసమని.. డ్రైవర్స్‌ స్టీరింగ్‌పై చేతులు తీయకుండా ఐఫోన్‌లో కాల్స్‌ చేయడం, వాయిస్‌ మెయిల్స్‌ వినడం లాంటి వాటికి ఉపయోగడుతుందని తెలిపారు. యాపిల్‌ మెర్సిడెజ్‌ బెంజ్‌, ఫోర్డ్‌ సంస్థల నుంచి ఆటోమొబైల్‌ నిపుణులను సంస్థలో నియమించుకుంటోంది. కానీ అధికారికంగా కార్ల తయారీ గురించి ఎలాంటి సమాచారం వెల్లడించడం లేదు. మరి నిజంగా యాపిల్ కార్లు వస్తాయో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

English summary

iPhone maker Apple Company registered the domain names, which include apple.car, apple.cars and apple.auto in December