ఆ ఫోన్ అన్ లాక్ చేయలేం: యాపిల్‌

Apple Rejects To Unlock That iPhone

03:35 PM ON 18th February, 2016 By Mirchi Vilas

Apple Rejects To Unlock That iPhone

అమెరికాలో నరమేధానికి పాల్పడిన ఓ వ్యక్తి ఫోన్‌ను అన్‌లాక్‌ చేయడానికి ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం యాపిల్‌ నిరాకరించింది. గత ఏడాది కాలిఫోర్నియాలో కాల్పులకు పాల్పడి 14 మంది మృతికి కారణమైన సయీద్‌ రిజ్వాన్‌ ఫారూఖ్‌ ఫోన్‌ను అన్‌లాక్‌ చేసి ఎఫ్‌బీఐ దర్యాప్తు అధికారులకు సహకరించాలని అమెరికా కోర్టు యాపిల్ కు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ వ్యక్తి ఫోన్ ను అన్ లాక్ చేసేందుకు యాపిల్‌ సుముఖంగా లేదు. దీనిపై యాపిల్ సీఈవో కుక్‌ మాట్లాడుతూ ‘యూఎస్‌ ప్రభుత్వం ఓ అసాధారణమైన పని చేసి ఎఫ్‌బీఐకి సహకరించాలని కోరుతోంది. దీనివల్ల మా కస్టమర్ల భద్రత చిక్కుల్లో పడుతుంది. దీనిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం’ అని అన్నారు. 2014 నుంచి వచ్చిన అధునాతన ఫోన్లలో డిఫాల్ట్‌ ఆటో ఎన్‌క్రిప్షన్‌ ఆప్షన్‌ ఆన్‌ చేసి ఉంటే సమాచారం నేరుగా భద్రపర్చుకునే అవకాశం ఉంటుంది. దీనిని చూడాలంటే కచ్చితంగా కోడ్‌ తెలిసి ఉండాలి. ఒక వేళ 10 సార్లు తప్పు కోడ్‌ వాడితే భద్రపర్చిన సమాచారం మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. తమ సిబ్బంది కూడా దీనిని తెరవలేరని యాపిల్‌ సంస్థ తెలిపింది. ఫరూఖ్‌ ఫోన్‌కు ఎన్నిసార్లు తప్పు కోడ్‌ ఇచ్చినా డేటా పోకుండా ఉండే అవకాశం కల్పించాలని ఎఫ్‌బీఐ యాపిల్‌ను కోరింది. ఫరూఖ్‌ నాలుగు అంకెల కోడ్‌ వాడి ఉంటాడని భావిస్తున్నారు. దీని కోసం దాదాపు 10,000 కాంబినేషన్లను వాడాల్సి ఉంటుంది.

English summary

Apple's chief executive Tim Cook says the company will contest a court order to help the FBI break into a phone recovered from one of the San Bernardino shooters.