స్మార్ట్ బ్యాటరీ కేస్‌ను విడుదల చేసిన యాపిల్ 

Apple Released Smart Battery Case

11:30 AM ON 9th December, 2015 By Mirchi Vilas

Apple Released Smart Battery Case

యాపిల్ కంపెనీ ఐఫోన్ వినియోగదారులు కోసం స్మార్ట్‌ బ్యాటరీ కేస్‌ను విడుదల చేసింది. ఐఫోన్ 6, ఐఫోన్ 6ఎస్‌ల మోడల్స్ కోసం ఇంటిగ్రేటెడ్ బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే స్మార్ట్ బ్యాటరీ కేస్‌ను రిలీజ్ చేసింది. బ్యాటరీ ఈ కేస్‌లోనే ఇమిడి ఉంటుంది. మన స్మార్ట్ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ ని 25 గంటల వరకు పెంచుతుందని యాపిల్ వెల్లడించింది. నలుపు , తెలుపు లాంటి రెండు రంగులతో ఈ కేస్ ను విడుదల చేసింది . సాఫ్ట్ టచ్ సిలికాన్, మైక్రోఫైబర్ పదార్థాలతో దీనిని తయారుచేశారు. ఫోన్ బ్యాటరీతో పాటు, స్మార్ట్ కేస్ బ్యాటరీని కూడా ఫోన్ నోటిఫికేషన్ సెంటర్‌లో చూడవచ్చు. అలాగే ఈ కేస్‌కు ఛార్జింగ్ పెట్టినప్పడు లాక్‌స్క్రీన్‌ పై ఛార్జింగ్ లెవల్స్ ఇండికేటర్ కనిపిస్తుంది . ఈ స్మార్ట్ బ్యాటరీ కేస్ ను భారత్‌లో ఎప్పుడు విడుదల చేస్తారనే విషయం ఇంకా కంపెనీ ఆపిల్ కంపెనీ వెల్లడించలేదు. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ స్మార్ట్ డివైస్ ధర 99 డాలర్లు గా ఉంది.

English summary

Apple released its New Smart phone battery Case and the company saying that smart phone battery case will defenately give You 25 Hours of Talk Time