యాపిల్‌ అమ్మకాలు తగ్గాయ్..

Apple Sales Down For The First Time In Last 13 Years

11:33 AM ON 28th January, 2016 By Mirchi Vilas

Apple Sales Down For The First Time In Last 13 Years

ప్రఖ్యాత ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ యాపిల్‌ ఆదాయం గణనీయంగా తగ్గింది. దాదాపు దశాబ్దం తర్వాత తొలిసారిగా యాపిల్ రెవెన్యూ తగ్గుముఖం పట్టడం గమనార్హం. సంస్థకు చెందిన ఐఫోన్‌ అమ్మకాలు గత ఏడాది తగ్గినట్లు సంస్థ వెల్లడించింది. 13 ఏళ్లలో తొలిసారి యాపిల్‌ సంస్థ రెవెన్యూ తగ్గిందని కంపెనీ వెల్లడించింది. చైనా ఆర్థిక వ్యవస్థ బలహీనం కారణంగా ఐఫోన్‌ ఎగుమతులు తగ్గినట్లు తెలిపింది. 2007లో సంస్థ ఐఫోన్‌ విడుదల చేసినప్పటి నుంచి అమ్మకాలు, ఆదాయం ఇప్పటి వరకు తగ్గలేదు. ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 74.8 మిలియన్ల ఐఫోన్లు అమ్మినట్లు సంస్థ వెల్లడించింది. తొలి త్రైమాసికంలో ఐఫోన్‌ 6ఎస్‌, 6ఎస్‌ ప్లస్‌ అమ్మకాలు జరిగాయి. ఎగుమతులు 0.4శాతం మాత్రమే వృద్ధిచెందగా... 2007 నుంచి ఇదే అతి తక్కువ వృద్ధి అని కంపెనీ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత త్రైమాసికంలో ఫోన్ల అమ్మకాలు తగ్గొచ్చని పేర్కొంది. అయితే అభివృద్ధికి అవకాశం ఉందని.. ఐఫోన్‌ 6 విడుదల చేయడానికి ముందు ఐఫోన్‌ వాడుతున్న 60 శాతం మంది వినియోగదారులు 6, 6ఎస్‌లకు అప్‌గ్రేడ్‌ కావాల్సి ఉందని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

English summary

Apple sales grew at the slowest pace since its introduction in 2007 and forecast that revenue in the current quarter will decline for the first time in 13 years