8 లక్షల ఐఫోన్లు అమ్మేసింది..

Apple Selled 8 Lakh Phones In Last Quarter In India

10:32 AM ON 23rd January, 2016 By Mirchi Vilas

Apple Selled 8 Lakh Phones In Last Quarter In India

యాపిల్‌ ఫోన్లకు భారత్‌లో రోజురోజూకు ఆదరణ పెరుగుతోంది. గత అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో యాపిల్‌ రికార్డు స్థాయిలో ఫోన్ల అమ్మకాలు జరపడమే దీనికా తార్కాణం. గత త్రైమాసికంలో యాపిల్‌ సంస్థ భారత్‌లో సుమారు 8 లక్షల ఫోన్లను అమ్మగలిగిందని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ సంస్థకు చెందిన సీనియర్‌ విశ్లేషకుడు తరుణ్‌ పాఠక్‌ తెలిపారు. సంస్థ ఒక త్రైమాసికంలో ఇన్ని ఫోన్లను అమ్మడం ఇదే తొలిసారని చెప్పారు. కొన్ని ఐఫోన్‌ మోడళ్ల ధరలు తగ్గిండచం, విస్తృత ప్రచారం, ఈఎంఐ సదుపాయం, బైబ్యాక్‌ స్కీం లాంటి ఆకర్షణీయ పథకాలు పెట్టడం వల్లనే సంస్థ ఇన్ని ఎక్కువ ఫోన్లను అమ్మగలిగిందని తెలిపారు. ఇప్పుడు సంస్థకి దేశ వ్యాప్తంగా విస్తృతమైన డిస్ట్రిబ్యూటర్ల నెట్వర్క్‌ ఉందన్నారు. కొంత కాలం అధిక ధరల కారణంగా భారత్‌లో ఈ ఫోన్లకు స్పందన అంతంత మాత్రంగా ఉండేదని అయితే ఇప్పుడు వీటికి డిమాండు క్రమంగా పెరిగే దశలో ఉందని పాఠక్‌ తెలిపారు.

English summary

World famous Smart Phone Manufacturing company Apple Selled 8 Lakh Phones In Last Quarter In India.This was said by one of the official.He says that due to schemes and the offers apple increased it sales in India