యాపిల్ నుంచి ఐఫోన్ 5ఎస్‌ఈ 

Apple To Launch iPhone 5se

09:25 AM ON 26th January, 2016 By Mirchi Vilas

Apple To Launch iPhone 5se

యాపిల్‌ మరోకొత్త ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఐఫోన్-5ఎస్‌కు మరిన్ని మెరుగులు దిద్ధి మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఐఫోన్‌-6లో ఉన్న స్పెషల్‌ ఫీచర్లను 5ఎస్‌లోనూ అమర్చాలని యాపిల్ కంపెనీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. 5ఎస్‌ తరహాలో నాలుగు అంగుళాల పొడవు ఉన్న ఈ కొత్త ఐఫోన్‌ను వచ్చే మార్చి నెలలో మార్కెట్‌లో ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఇందులో 8 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమరా, 1.2 మెగాపిక్సెల్ ఫ్రంట్‌ కెమెరా, ఆపిల్ ప్లే యాప్‌ పనిచేసేవిధంగా ఎన్‌ఎఫ్‌సీ చిప్, ఏ 8 ప్రాసెసర్‌తోపాటు కనెక్టివీటికి సంబంధించి వై-ఫై వంటి ఫీచర్లు మరింత మెరుగవ్వనున్నాయని వర్జ్‌ మీడియా సంస్థ తెలిపింది. దీంతోపాటు ఈ ఫోన్‌లో స్వల్పంగా డిజైన్‌ మార్పులు కూడా ఉంటాయని యాపిల్ తెలిపిందని పేర్కొంది. దీనిని ఐఫోన్‌-5ఎస్‌ఈగా పిలిచే అవకాశముంది. లైవ్‌ ఫోటో ఫీచర్‌ను సపోర్ట్‌ చేసే ఈ మోడల్‌ మార్చి నెలలో మార్కెట్‌లోకి వచ్చే అవకాశముంది. దీనితోపాటు కొత్త వెర్షన్ యాపిల్ వాచ్‌లను కూడా విడుదల కానున్నాయి.

English summary

World famous Top company Apple company to launch a 4-inch iPhone - dubbed iPhone 5se ,iPad Air , and New Watch Models