సగానికి సగం తగ్గనున్న ఐఫోన్ ధరలు

Apple To Sell iPhone 5S for Half Of The Original Price

10:13 AM ON 15th March, 2016 By Mirchi Vilas

Apple To Sell iPhone 5S for Half Of The Original Price

ఫోన్ వాడని వాళ్ళు ఎవరైనా వున్నారా అంటే లేరని చెప్పేయొచ్చు . మొబైల్ ఫోన్లు వచ్చాక పరిస్థితి అంతలా మారిపోయింది మరి. చైనా ఫోన్లు , ఆ ఫోన్లు ఈ ఫోన్లూ ఇలా రకరకాల ఫోన్లు మార్కెట్ లో దొరికేస్తున్నాయి. ఇక టచ్ స్క్రీన్ ఫోన్లు , స్మార్ట్ ఫోన్లు యువత చేతిలో ప్రధాన వస్తువుగా మారిపోయింది. ఇక ఫోన్లను ప్రమోట్ చేసే క్రమంలో మంచి మంచి ఆఫర్లు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఐ ఫోన్ ధరలు కూడా సగం ధరకే చేతికి అందనున్నాయి. దీంతో సంపన్నుల మొబైల్గా పేరున్న ఆపిల్ ఫోన్ ఇప్పుడు మధ్యతరగతి వారికి కూడా అందుబాటులోకి రాబోతోంది. మార్చి 22న ఆవిష్కరించనున్న ఐఫోన్ ఎస్ఇ మోడల్ ప్రమోషన్లో భాగంగా ఐఫోన్ 5ఎస్ ధరను సగానికి సగం తగ్గించి అమ్మాలని యాపిల్ కంపెనీ యోచిస్తోంది. యుఎస్లో ప్రస్తుతం ఐఫోన్ 5 ఎస్ ధర 30 వేలకు పైగానే ఉంది. అయితే ఐఫోన్ ఎస్ఇ లాంచింగ్ తర్వాత ఈ ఫోన్ 15 వేలకే వినియోగదారులకు అందిస్తారట. ఈ తగ్గింపు కేవలం అమెరికాలో మాత్రమే కాదు. యుఎస్లో తగ్గించిన కొద్ది రోజుల్లోనే ఇండియాలో కూడా తగ్గింపు ధరలను అమలు చేయాలని సంస్థ యోచిస్తోంది. ఎస్ఇ మోడల్ ప్రమోషన్లో భాగంగానే ఇంత భారీ తగ్గింపును ప్రకటిస్తున్నట్లు టెక్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమెరికాలోనే కాకుండా ఇండియాలో కూడా త్వరలోనే ఐ ఫోన్ ధరలు భారీగా తగ్గుతుందనే వార్తతో ఐ ఫోన్ అభిమానులు మార్చి 22 కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఇక చాలామంది చేతిలో ఐ ఫోన్ దర్శనం ఇవ్వనుంది.

English summary

Technology Giant Apple Company to reduce the price of iPhone 5S price to half of the Original Price.Apple company made this decision to promote their upcoming Iphone SE model.iPhone SE model will be release on 22nd of this month.