భారత్ లోకి ఐపాడ్ ప్రో, యాపిల్ టీవీ

Apple Tv,Ipad Pro launched in India

05:18 PM ON 10th December, 2015 By Mirchi Vilas

Apple Tv,Ipad Pro launched in India

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ యాపిల్ తన ఐపాడ్ ప్రో ట్యాబ్ ను భారత్ లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. అయితే వీటి ధరలను వెల్లడించినా.. దీనిపై అధికారికంగా యాపిల్ ఎటుంటి ప్రకటనా చేయలేదు. 32 జీబీ వైఫై మోడల్ ధర రూ.67,900, 128 జీబీ వైఫై మోడల్ ధర రూ. 79,900గా ఉండే అవకాశం ఉంది. ఇక వైఫై - సెల్యూలర్ రెండు ఉన్న 128 జీబీ మోడల్ ధర రూ.91,900 ఉండే అవకాశం ఉంది. అయితే యాపిల్ పెన్సిల్, స్మార్ట్ కీ బోర్డు మాత్రం భారత్ లో లాంచ్ చేసే అవకాశాలు ఇప్పట్లో లేవు. ఎందుకంటే అంతర్జాతీయంగా ఉత్పత్తి తక్కువగా ఉన్నందున భారత్ లో విడుదల ఆలస్యం కానుంది.

ఐపాడ్ ప్రో టాబ్లెట్‌కు 12.9ఇంచుల డిస్‌ప్లే, స్క్రీన్ రిజల్యూషన్ 2732×2048 పిక్సెల్స్ ఉంది. ఈ టాబ్లెట్ యాపిల్ ఎ9ఎక్స్ ప్రాసెసర్, ఐఒఎస్ 9 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. దీనికి 4జిబి ర్యామ్, 32జిబి అంతర్గత సామర్థం గలదు. ఇందులో ఫ్రంట్ కెమెరా, రియర్ కెమెరా, 8-మెగాపిక్సెల్ రియర్ కెమెరాలు ఉన్నాయి. ఇది నానో -సిమ్/యాపిల్ సిమ్ (యుఎస్‌అండ్ యుకె)లతో పనిచేస్తుంది. ఇందులో ఎల్‌ఇడి-బ్యాక్లిట్ ఐపిఎస్ ఎల్‌సిడి, టచ్‌స్క్రీన్, 16ఎమ్ కలర్స్‌లు సౌకర్యాలు ఉన్నాయి. ఈ టాబ్లెట్ స్పేస్ గ్రే, సిల్వర్, గోల్డ్ కలర్స్‌లలో లభిస్తుంది. ఇందులో వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్, యుఎస్‌బి కమ్యూనికేషన్ సౌకర్యాలు ఉన్నాయి. దీని బరువు 723 గ్రాములుగా ఉంటుంది.

యాపిల్ కొత్త టీవీని కూడా భారత్ లో విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశంలో చాలా మంది రిటెయిలర్ల వద్ద అందుబాటులో ఉన్న యాపిల్ టీవీ 32 జీబీ మోడల్ ధర రూ. 13,500గా 64 జీబీ మోడల్ ధర రూ. 17,900గా నిర్ణయించినట్టు సమాచారం. ఈ కొత్త యాపిల్ టీవీలో యాప్ స్టోర్ తో పాటు వాయిస్ తో కంట్రోల్ చేసే రిమోట్ కంట్రోల్ ఉంది. ఇది సిరి తో పని చేస్తుంది.

English summary

Apple company released the iPad Pro and apple tv in India. But Apple company has not made an official announcement on the prices of these products