ఐఓఎస్‌ డెవలప్ మెంట్ స్కూల్‌

Apple's iOS Development School

12:46 PM ON 22nd January, 2016 By Mirchi Vilas

Apple's iOS Development School

ఐఓఎస్‌ డెవలప్ మెంట్ స్కూలా.. అదేంటి అనుకుంటున్నారా.. ఐఫోన్ లో ఉండే ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తెలుసుకదా. దీనిని అభివృద్ధి చేయడం కోసం యూరప్‌లోని ఇటలీలో స్కూలును ప్రారంభిస్తున్నట్లు యాపిల్ సంస్థ ప్రకటించింది. నేపుల్స్‌కి చెందిన భాగస్వామ్య సంస్థ సహాయంతో ఐఓఎస్‌ అభివృద్ధిపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది. యాపిల్‌ తన సంస్థ ప్రత్యేకతను స్థిరపరచుకుంటూనే, భవిష్యత్‌ అవసరాలకోసం నూతన యాప్స్‌ను
అభివృద్ధి చేసుకోవడమే లక్ష్యంగా స్కూల్‌ను ప్రారంభిస్తోంది. యూరప్‌లో 1.2 మిలియన్ల టెక్‌ జాబ్స్‌కి అవకాశాలున్నాయంటున్న యాపిల్‌ ఒక్క ఇటలీలోనే 75వేల ఉద్యోగులను నియమించుకోనుంది. అదీ ఐఓఎస్‌తో పనిచేసేవారినే. ఒకసారి కంపెనీకి చెందిన తొలి యాప్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రం పనిచేయడం ప్రారంభించగానే యూరప్‌లోని ఇతర దేశాల్లోనూ ఐఓఎస్‌ అభివృద్ధి కేంద్రాలను యాపిల్‌ స్థాపించనుంది. ఇప్పటికే ఐఓఎస్‌ యాప్స్‌ తయారుచేస్తున్నవారికి పలు ఆన్‌లైన్‌ వనరుల శ్రేణిని అందుబాటులోకి తెచ్చిన యాపిల్‌ గత అక్టోబర్‌లో ఇండోనేషియాలో ఐఓస్‌ అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

English summary

Popular Apple Company announced that its first ever developer training school was starting in Europe.