యాపిల్ లో జీతం@172 కోట్లు

Apple's Pays 172Crores To Its Employee

05:35 PM ON 7th January, 2016 By Mirchi Vilas

Apple's Pays 172Crores To Its Employee

యాపిల్.. ప్రపంచ వ్యాప్తంగా అనేక మందికి ఇష్టమైన బ్రాండ్. ప్రతి ఒక్కరూ కొనుగోలు చేయాలని భావించే వస్తువులు యాపిల్ సొంతం. ఇక ఈ సంస్థలో చేరితే జీవితం సెటిల్ అయిపోయినట్టే అని యువత కలలు కంటూ ఉంటుందంటే అతిశయోక్తి కాదు. గత ఏడాది ఐఫోన్‌, ఐ ప్యాడ్‌ విక్రయాలు పెరగడంతో యాపిల్ భారీ లాభాలు ఆర్జించింది. 2015లో సంస్థ అమ్మకాలు 28 శాతం పెరిగి.. లాభాలు 38 శాతం పెరిగాయి. దీంతో యాపిల్‌ సీఈవో టిమ్‌ కూక్‌ వేతనం కూడా భారీగా పెరిగింది. ఆయన వేతన 11.5శాతం పెరిగి 10.3 మిలియన్ డాలర్ల (రూ. 69 కోట్ల)కు చేరుకుంది. ఇక యాపిల్‌ కంపెనీలో సీఈవో కూక్‌ కన్నా ఇతర ఎగ్జిక్యూటివ్‌ల జీతాలు అధికంగా ఉండటం గమనార్హం. గత ఏడాది యాపిల్ చీఫ్ ఫైనాన్షియల్ అధికారి లుకా మేస్ట్రీ వేతనం 81 శాతం పెరిగి 25.3 మిలియన్ డాలర్ల (రూ. 169 కోట్ల)కు పెరిగింది. అదేవిధంగా రిటైల్, ఆన్‌లైన్ స్టోర్స్‌ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌ ఏంజెలా ఎరెండట్స్‌ వేతనం భారీగా పెరిగి 25.8 మిలియన్ డాలర్ల (రూ. 172 కోట్ల)కు చేరుకుంది. 2015లో కూక్‌ మౌలిక వేతనం 14.4 శాతం పెరిగి రెండు మిలియన్‌ డాలర్లకు చేరుకోగా, ఆయనకు చెల్లించే నాన్ ఈక్విటీ పరిహారం 19 శాతం పెరిగి 8 మిలియన్ డాలర్లకు చేరుకుంది. కూక్‌ నేతృత్వంలో 2015 యాపిల్‌కు బాగా కలిసొచ్చింది. చైనాలో యాపిల్‌ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఐఫోన్ అమ్మకాలు రికార్డుస్థాయిలో కొనసాగాయి. ఇదంతా బాగానే ఉన్నా 2008 తర్వాత తొలిసారి యాపిల్‌ వాటాలు మాత్రం గత ఏడాది పతనమయ్యాయి.

English summary

An Apple company employee gets 172 crore rupees as her salary. Angela Ahrendts who was Retail Chief in apple comany.