'డిలీటెడ్' ఫోటోలను రికవర్ చేయాలా..

Apps That Recover Deleted Photos

03:35 PM ON 8th December, 2015 By Mirchi Vilas

Apps That Recover Deleted Photos

ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్‌ఫోన్ ఉంటోంది. ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్లినా మామూలు ఫోటో లేదా సెల్ఫీలు దిగడం ఎక్కువైంది. ఫోటోలు లేదా వీడియోలు ఏవి తీసుకున్నా అధిక స్టోరేజ్ స్పేస్ కలిగిన డివైస్‌లు యూజర్లకు అందుబాటులో ఉండడంతో మెమోరీ కార్డ్ కెపాసిటీ ఎంత ఖాళీగా ఉందో చూసుకునే పని లేకుండా పోయింది. అయితే ఎంతో ఇష్టంగా తీసుకున్న ఫోటోలు డివైస్‌లో నుంచి అనుకోకుండా డిలీట్ అయితే ఎలా? అందుకు సమాధానమే ఈ 'యాప్స్'. ఇవి మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉంటే చాలు, ఫోటోలు డిలీట్ అయినా వాటిని తిరిగి రికవరీ చేసుకునేందుకు వీలుంది.

రీస్టోర్ ఇమేజ్ (Restore Image)

ఆండ్రాయిడ్ డివైస్‌లో డిలీట్ అయిన ఫోటోలను ఈ యాప్ సహాయంతో సులువుగా రికవరీ చేసుకోవచ్చు. పీసీ, రూటింగ్ అవసరం లేకుండానే ఇమేజ్‌లను రీస్టోర్ చేసుకునేందుకు వీలుంది. డివైస్ ఇంటర్నల్ లేదా ఎస్‌డీ కార్డ్ మెమోరీ నుంచి ఫోటోలను ఈజీగా రికవర్ చేయవచ్చు. యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని రికవరీ చేయాల్సిన డ్రైవ్ లేదా ఫోల్డర్‌ను ఎంచుకుని స్టార్ట్ బటన్‌ను ప్రెస్ చేస్తే చాలు, ఫోటో రికవరీ ప్రాసెస్ స్టార్ట్ అయి ఇమేజ్‌లు రీస్టోర్ అవుతాయి.

Download Now

ఫోటో రికవరీ (Photo Recovery)

రూట్ అవసరం లేకుండానే డిలీట్ అయిన ఫోటోలను రీస్టోర్ చేసుకునేందుకు వీలుంది. నూతన అల్గారిథమ్ పద్ధతులను ఉపయోగించి ఫోటోలను వేగంగా రికవరీ చేసుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఫోటోలు, వీడియోలు, ఆడియో, ఇతర ఫైల్స్‌ను దీని ద్వారా తిరిగి పొందేందుకు వీలుంది.

Download Now

ఫోటో రికవరీ వర్క్‌షాప్ (Photo Recovery Workshop)

శాంసంగ్, సోనీ, గూగుల్ నెక్సస్, మోటోరోలా, జడ్‌టీఈ, ఎల్‌జీ, లెనోవో, హెచ్‌టీసీ, హువావే వంటి బ్రాండెడ్ ఫోన్లలో మరింత సమర్థవంతంగా పనిచేసేలా దీన్ని తీర్చిదిద్దారు. డిలీట్ అయిన ఫోటోలు ఎటువంటి క్వాలిటీ కోల్పోకుండా దాన్ని అలాగే మళ్లీ పొందేందుకు ఈ యాప్ దోహదపడుతుంది. ఈ యాప్‌కు చెందిన ప్రీమియం వెర్షన్‌ను కొనుగోలు చేస్తే మరిన్ని ఫీచర్లను పొందేందుకు అవకాశం ఉంది.

Download Now

డంప్‌స్టర్ ఇమేజ్ అండ్ వీడియో రీస్టోర్ (Dumpster Image & Video Restore)

మాక్, లైనక్స్, విండోస్ డెస్క్‌టాప్ కంప్యూటర్లలో ఉండే రీసైకిల్ బిన్ మాదిరిగానే ఈ యాప్ పనిచేస్తుంది. దీని ద్వారా రికవరీ చేసిన ఫోటోలను డ్రాప్‌బాక్స్, గూగుల్ డ్రైవ్, మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్ వంటి క్లౌడ్ స్టోరేజ్ యాప్స్‌కు బ్యాకప్‌గా పంపించుకునేందుకు వీలు కల్పించారు. దాదాపు అన్ని రకాల ఇమేజ్, వీడియో, ఆడియో, పీడీఎఫ్, జిప్, ఎంపీ3, ఎంపీ4, పీపీటీ, డాక్, ఏవీఐ, ఎంపీజీ వంటి ఫైల్ ఫార్మాట్ల రికవరీని ఇది సపోర్ట్ చేస్తుంది

Download Now

జీటీ రికవరీ - ఆన్‌డిలీట్, రీస్టోర్ (GT Recovery - Undelete, Restore)

ఇది కేవలం 'రూటింగ్' చేయబడ్డ ఆండ్రాయిడ్ డివైస్‌లలో మాత్రమే పనిచేస్తుంది. ఫోన్‌లోని ఫోటోలు, ఇతర ఫైల్స్ కలిగిన డ్రైవ్ లేదా ఫోల్డర్స్‌ను స్కాన్ చేయడం ద్వారా డిలీట్ అయిన ఫోటోలను తిరిగి రాబట్టుకోవచ్చు. కేవలం ఫోటోలే కాకుండా ఇతర వీడియో, ఆడియో ఫైల్స్‌ను కూడా దీని ద్వారా రీస్టోర్ చేసుకునేందుకు వీలుంది.

Download Now

English summary

When a photo is deleted in your smart phone then we can get those images back by using some of the apps like Restore Image,Photo Recovery,(Photo Recovery Workshop,Dumpster Image & Video Restore,GT Recovery - Undelete, Restore. These apps were available for free in google play store