ఎ.ఆర్‌. రెహమాన్‌ తనయుడు పాడిన పాట ఇదే

A.R. Ameen song in Nirmala Convent

04:49 PM ON 16th February, 2016 By Mirchi Vilas

A.R. Ameen song in Nirmala Convent

శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'నిర్మలా కాన్వెంట్‌'. 'జై చిరంజీవ' లో చిరంజీవికి మేనకోడలిగా నటించిన శ్రేయాశర్మ ఈ చిత్రంలో రోషన్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్‌-మ్యాట్రిక్‌ టీమ్‌ వర్క్స్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి జి.నాగేశ్వర రావు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి రోషన్‌ సాలూరి సంగీతం అందించాడు. అయితే ఇందులో ఒక పాట సంగీతం దిగ్గజం ఎ..ఆర్‌. రెహమాన్‌ తనయుడు ఎ.ఆర్‌. అమీన్‌ పాడాడు. ఈ విషయం కొద్ది రోజులు ముందే ప్రకటించారు. ఇప్పుడు తాజాగా ఆ పాటని లిరిక్స్‌తో సహా నాగార్జున తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

అంతేకాదు నా నిర్మాణంలో ఎ.ఆర్‌. రెహమాన్‌ గారి తనయుడ్ని పరిచయం చేస్తున్నందుకు ఎంతో గొప్పగా ఉందని ట్వీట్‌ చేశారు. ఒకసారి మీరు కూడా ఆ పాటని చూడండి.

English summary

A.R. Ameen song in Nirmala Convent. In this movie Srikanth's son Roshan is acting as a hero. Shreya Sharma is romancing with Roshan in this movie.