ఫస్ట్ లుక్ లోనే ఆకట్టుకున్న ‘99 సాంగ్స్’

AR Rahman 99 Songs First Look

10:58 AM ON 12th March, 2016 By Mirchi Vilas

AR Rahman 99 Songs First Look

ఎన్నో పాటలకు తన సంగీతంతో ప్రాణం పోసిన ఎ.ఆర్.రెహమాన్ తొలిసారి ఓ సినిమాకి కథ అందిస్తున్నాడు. ‘99 సాంగ్స్’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమా వైఎం మూవీస్ బ్యానర్‌పై రెహమాన్ నిర్మాణంలోనే తెర కెక్కుతోంది. డాక్యుమెంటరీ చిత్రాల దర్శకుడు విశ్వేష్ కృష్ణమూర్తి దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌‌ను రెహమాన్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేసాడు. రెహమాన్ స్వరాల్లాగే ఈ పోస్టర్ కూడా కవితాత్మకంగా వుందని సినీ ప్రియుల వర్ణన. రెహమాన్ సంగీతం సమకూర్చనున్న ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక జరుగుతోంది. తమిళ, హిందీ భాషల్లో నిర్మితమవనున్న ‘99 సాంగ్స్’ చిత్రం ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదికి వస్తుంది. వచ్చే ఏడాది తెరమీదికి వస్తుందని అంటున్నారు.

With your support & good wishes, I'm pleased to share my movie's first poster!

Posted by A.R. Rahman on Wednesday, March 9, 2016

English summary

Music composer and Oscar winner A.R.Rahman has released the first poster of his film 99 Songs.This movie was producing by A.R.Rahman in his own banner.