పాత కారే అయినా అపురూపం

AR Rahman Shares His First Car Photo Gifted By His Mother

10:29 AM ON 9th September, 2016 By Mirchi Vilas

AR Rahman Shares His First Car Photo Gifted By His Mother

బహుమతి అంటేనే అదో థ్రిల్ ... అసలు బహుమతులు అందుకోవడంలో ఉన్న ఆనందం మరెక్కడా ఉండదని అంటారు. అది చిన్నదయినా పెద్దదయినా సరే, వాటిని అందుకున్నాక జాగ్రత్తగా దాచుకుంటాం. ఎవరెవరో అభినందిస్తూ ఇచ్చిన బహుమతులనే అంత జాగ్రత్తగా దాచుకుంటే, సాక్షాత్తూ అమ్మ ఇచ్చిన బహుమతిని ఇంకెత జాగ్రత్తగా దాచుకోవాలి. అందుకే ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు ఏఆర్ రెహమాన్ కూడా అలాగే భద్రపరుచుకున్నాడు. 1986లో తల్లి కరీమాబేగం రెహ్మాన్ కి ఓ అంబాసిడర్ కారును బహుమానంగా ఇచ్చారు. తల్లిని ప్రాణంగా చూసుకునే రెహమాన్.. ఆమె ఇచ్చిన బహుమానాన్ని కూడా ఇప్పటికీ అలాగే అపురూపంగా చూసుకున్నారు. దాన్ని ఇప్పటికీ జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇంటి ఆవరణలో అది భద్రంగా ఉంది. ఈ విషయాన్ని రెహమాన్ ఫేస్ బుక్ లో పంచుకున్నాడు.

English summary

Oscar Winner and India's Top Music Director A.R.Rahamn shares his first car photo which was gifted by his mother in the year 1986. Rahman posted the pic of that car in social media.