శ్రీకాంత్‌ కొడుకు చిత్రంలో రెహమాన్‌ తనయుడు

A.R. Rahman son sung a song in Nirmala convent

06:32 PM ON 11th February, 2016 By Mirchi Vilas

A.R. Rahman son sung a song in Nirmala convent

శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ను హీరోగా పరిచమం చేస్తూ తెరకెక్కుతున్న చిత్రం 'నిర్మలా కాన్వెంట్‌'. అక్కినేని నాగార్జున-మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి. నాగకోటేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్నారు. జై చిరంజీవ, నువ్వునేను ప్రేమ, దూకుడు, రోబో వంటి చిత్రాల్లో బాలనటిగా నటించిన శ్రేయాశర్మ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రానికి రోషన్‌ సాలూరి సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో మరో విశేషం ఏమిటంటే ఆస్కార్‌ అవార్డ్‌ విజేత ఎ.ఆర్‌. రెహమాన్‌ తనయుడైన ఎ.ఆర్‌ అమీన్‌ ఒకపాట పాడబోతున్నాడు. ఈ చిత్రంలో తన తనయుడ్ని గాయకుడిగా పరిచయం చెయ్యాలని రెహమాన్‌ అభిప్రాయమట.

ఎ.ఆర్‌. అమీన్‌ పాడిన పాట ఫిబ్రవరి 12న విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో మరో విశేషమేమిటంటే కింగ్‌ నాగార్జున అతిధి పాత్రలో కనిపించనున్నారు.

English summary

A.R. Rahman son sung a song in Nirmala convent movie. In this movie Srikanth son Roshan is introducing as a hero. Shreya Sharma is romancing with Roshan in this movie.