అరకు కాఫీకి  గుర్తింపు కోరిన ఎంపి

Araku MP Kothapalli Geetha Meets Narendra Modi

11:43 AM ON 28th April, 2016 By Mirchi Vilas

Araku MP Kothapalli Geetha Meets Narendra Modi

అరకు ఎంపీ కొత్తపల్లి గీత బుధవారం ప్రధాని మోడీని కలిశారు. అరకు కాఫీకి భౌగోళిక గుర్తింపు సహా ప్రోత్సాహం కావాలని ప్రధాని మోడీకి ఆమె విజ్ఞప్తి చేశారు. అరకు పర్యాటక ప్రాంతాలతో బ్రోచర్ ను మోడీ కి అందజేశారు. అరకుకు మంజూరైన గ్లాస్ ట్రైన్ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా మోడీని ఆహ్వానించారు. ప్రధాని మోదీ వస్తే అరకు పర్యాటకం ఊపందుకుంటుందని కొత్తపల్లి గీత అన్నారు.

ఇవి కూడా చదవండి: మరో దఫా 'పనామా పేపర్స్' మహా రిలీజ్

పర్యాటకంతో అరకు ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కొత్తపల్లి గీత పేర్కొన్నారు.అరకు నియోజకవర్గంలో రోడ్లు, టెలీకమ్యూనికేషన్ మెరుగుపర్చడానికి ప్రధాని మోడీని నిధులు అడిగానని,జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూడా రోడ్లు వేయించవచ్చని కొత్తపల్లి గీత తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల యువతకు ఉద్యోగాల్లో ప్రత్యేక మినహాయింపులు ఇచ్చార;ని, అరకు గిరిజన యువతకు కూడా మినహాయింపులు ఇవ్వాలని ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ప్రధాని మోదీని కొత్తపల్లి గీత కోరారు.యువతకు ఉపాధి పెరిగితేనే మావోయిస్టు ప్రాబల్యం తగ్గుందని ప్రధాని మోడీకి కొత్తపల్లి గీత వివరించారు.

ఇవి కూడా చదవండి:అమ్మో! 1500 ఏళ్ల నాటి శవానికి అడిడాస్ షూస్!

ఇవి కూడా చదవండి:గూగుల్, ఫేస్ బుక్ సెకనుకు ఎంత సంపాదిస్తుందో తెలుసా?

ఇవి కూడా చదవండి:విమానం టాయ్ లెట్ లో 7కేజీల బంగారం!!

English summary

Araku MP Kottapalli Geeta meet Prime Minister Of India Narendra Modi and Welcomed him to the opening of Araku Glass Train.She also said some of the problems facing by Araku People.