నాకో మొగుడు కావాలి

Aranya Pui Pathoumthong wants husband

01:15 PM ON 5th April, 2016 By Mirchi Vilas

Aranya Pui Pathoumthong wants husband

ప్రచారం లేనిదే నిద్ర పట్టదు కొందరికి... ఇక ఎడాపెడా ప్రచారంలో ఆరితేరిపోయారు కొందరు... ఇక… ప్రతీదీ వ్యాపారమైపోయిన పరిస్థితిలో ‘పబ్లిసిటీ‘ పిచ్చి ముదిరి పాకాన పడింది... "వెర్రి వేయి రకాలు”గా ఉందన్నట్లుగా… ఇంకా చెప్పాలంటే, అది పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయింది. అర్ధం పర్ధం లేని, సభ్య సమాజం సిగ్గు పడేలా పబ్లిసిటీ మారిపోయింది. తాజాగా ప్రముఖ థాయ్‌లాండ్ నటి ”నాకో మొగుడు కావాలి” అంటూ థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని లాట్ ఫ్రావ్‌ జిల్లాలోని కూడలిలో ఓ పెద్ద ఫ్లెక్సీ హోర్డింగ్ వెలసింది.. ఈ నటి పడుకొన్న అర్ధ నగ్న ఫోటోతో హోర్డింగ్ దర్శనివ్వడంతో స్థానికంగా కలకలం రేగింది.

ఇదేమిట్రా బాబూ అంటూ పలువురు గుసగుస లాడుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఈ థాయ్‌లాండ్ బి -గ్రేడ్ నటి అయిన ‘అరణ్య పుయ్‌ పాథుమ్‌థాంగ్‌‘ ”నా వయస్సు 40. నేనింకా కన్యనే… కాబోయే భర్త కోసం ఎదురు చూస్తున్నా” అంటూ ”వాంట్ యూ” అనే క్యాప్షన్ కూడా పెట్టింది… అంతేనా పెళ్లి చేసుకోవడానికి ఎవరికైనా ఆసక్తి ఉంటే సంప్రదించడానికి 099-6207935 ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింది.” చనిపోవడానికి ముందు ఒక్కసారైనా వైవాహిక జీవితాన్ని ఆస్వాదించాలనుకుంటున్నానని… కన్యగా చనిపోవాలని లేదు” అని ఈ భారీ వ్యాపార ఫ్లెక్సీ బోర్డ్ ప్రకటనలో ఘాటుగా స్పష్టం చేసింది.

అర్ధ నగ్న ఫోజు ఫోటోతో బహిరంగంగా ఈ వ్యాపార ఫ్లెక్సీ ఉండడాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు హోర్డింగ్ పెట్టినందుకు యాడ్ ఏజెన్సీ పై చర్యలు తీసుకున్నారు. ThB.500(రూ.1000) ఫైన్ విధించి, ఆ హోర్డింగ్ తొలగించారు.' పెళ్లి అయితే గానీ పిచ్చి కుదరదు” పెద్దలు అనేది నిజమే గా... లేకపోతే ఏమిటి వింత పోకడ...

English summary

Aranya Pui Pathoumthong wants husband. Thailand model Aranya Puli Pathoumthong wants husband.