రామ్‌చరణ్‌ చిత్రంలో నటించనున్న అరవింద స్వామి

Aravinda Swamy To Act In Ramcharan Movie

07:29 PM ON 30th November, 2015 By Mirchi Vilas

Aravinda Swamy To Act In Ramcharan Movie

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ నటించబోయే తదుపరి చిత్రంలో తమిళ నటుడు అరవిందస్వామి నటించనున్నారు . తమిళం లో సూపర్ హిట్ అయిన 'తని ఒరువన్‌' చిత్రాన్ని తెలుగులో రామ్‌చరణ్‌ రిమేక్‌ చెయ్యబోతున్నాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగులో అల్లు అరవింద్‌, ఎన్వీ ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మించనున్నారు. తమిళంలో తని ఒరువన్‌ లో విలన్‌గా నటించిన సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన అరవింద స్వామి ని ఈ తెలుగు రీమేక్ లో నటింపజేయడానికి గట్టి ప్రయత్నాలు చేశారు. అయితే అరవిందస్వామి నటించేందుకు సుముఖత చూపలేదని మీడియాలో వార్తలొచ్చాయి. కాగా రామ్‌చరణ్‌ కోసం అరవిందస్వామి ఈ రీమేక్‌ లో నటించేందుకు అంగీకారించాడని సమాచారం ..ఈ చిత్రానికి కాను అరవిందస్వామి 5 కోట్ల పారితోషకాన్ని తీసుకుంటున్నాడని సమాచారం. జనవరి నెలలో రెగ్యూలర్‌ ఘాటింగ్‌ ప్రారంభం అవుతుందని , జూన్‌ లేదా జులై లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు అల్లు అరవింద్‌ భావిస్తున్నాడని తెలుస్తోంది.

English summary

Tamil Actor To be act as villian in rama charans next movie.This movie is the remake of tamil super hit movie " tani oruvan". Director surendar reddy to direct this movie