'మేడ్ ఫర్ ఈచ్ అదర్' అనిపించుకోవాలంటే మీలో ఈ క్వాలిటీస్ ఉండాలి

Are you made for each other

03:27 PM ON 16th September, 2016 By Mirchi Vilas

Are you made for each other

పూర్వం పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకుని, కష్టాలు పడైనా సరే కాపురాన్ని నిలబెట్టుకునేవారు. కానీ రాను రాను పరిస్థితులు మారాయి. భార్యాభర్తల్లో ఎవరికెవరూ తగ్గడం లేదు. అందుకే ఇద్దరు వేర్వేరు వ్యక్తులు, వేర్వేరు మనస్తత్వాలు, వేర్వేరు ఫ్యామిలీల నుంచి, వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన ఇద్దరు కలిసి ఉండటం కష్టంగా మారింది. ఇద్దరి లైఫ్ స్టైల్స్, అలవాట్లు, ఐడియాలు, ఆలోచనలు వేరుగా ఉన్నవాళ్లు కలిసి హ్యాపీగా ఉండటం అనేది అంత ఈజీ కాదు. ఇద్దరి మధ్య సఖ్యత కుదరడం కూడా అంత సులభం కాదు. వేర్వేరు వ్యక్తులైనా, ఇద్దరూ హ్యాపీగా ఉంటున్నారు అంటే అది మిరాకిలే. అంటే మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అర్ధం. ఏ రిలేషన్ కూడా పర్ఫెక్ట్ కాదు.

మీ భాగస్వామి ఇష్టాలను గౌరవిస్తున్నారు, అంగీకరిస్తున్నారు.. అలాగే వాళ్లు కూడా మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నారంటే.. మీ ఇద్దరి ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుందని సంకేతం. భార్యా, భర్త ఇద్దరూ టీం మెంబర్స్ లాంటివాళ్లు. ఇద్దరూ కష్టపడటం వల్ల తమ జీవిత లక్ష్యాలను చేరుకోగలుగుతారు. సొంతిళ్లు, పిల్లలను పెంచడం వంటి బాధ్యతలు నెరవేరుస్తారు. ఒకవేళ అంగీకారతత్వం లేకపోతే, వైవాహిక బంధం ఎక్కువకాలం ఉండలేదు. చాలావేగంగా బంధం బలహీనమవుతుంది. కాబట్టి, మీ ఇద్దరి బంధం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపిస్తుందని తెలిపే సంకేతాలు తెలుసుకోండి.

1/9 Pages

క్వాలిటీ 1: ఎలాంటి దాపరికం లేకుండా.. అన్ని విషయాలు మీ భర్తతో వివరిస్తారు. అలా చేస్తే.. మీరు ఖచ్చితంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఒకవేళ అసహ్యకరమైన విషయాలను దాచిపెడుతున్నారంటే.. మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించుకోరు.

English summary

Are you made for each other